CJP: ఢిల్లీలో హోరెత్తిన ఆందోళనలు.. విద్యాశాఖ మంత్రిపై సీజేపీ ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వేలాదిమంది ప్రజలు ఢిల్లీలోని జంతర్ మంతర్‌కు తరలివస్తున్నారు. ఈనేపథ్యంలో పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నిరసనకారులకు కీలక విజ్ఞప్తి చేశారు. ఆందోళనలు పూర్తిగా శాంతియుతంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌ను కూడా ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుత పద్ధతిలో వ్యక్తం చేయాలని సూచించారు. నిరసనల సందర్భంగా జంతర్ మంతర్ వద్ద ఓ వ్యక్తి బొద్దింక మాస్క్ ధరించి కనిపించడం ఆకర్షణగా మారింది. ఈ ఆందోళనలకు పలు విపక్ష పార్టీల నేతలు, సామాజిక కార్యకర్తలు కూడా మద్దతు తెలుపుతున్నారు. సాగరిక ఘోస్తో పాటు ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా ఈ నిరసనలకు మద్దతు ప్రకటించారు.
వివరాలు
భారీగా మోహరించిన పోలీసు బలగాలు
జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిర్వహిస్తున్న ఈ ఆందోళనలకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే భద్రతా పరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పరిస్థితులను సమీక్షించేందుకు ఉన్నతస్థాయి భద్రతా సమావేశాన్ని కూడా నిర్వహించారు. జంతర్ మంతర్ ప్రాంగణం మొత్తం "ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి" అనే నినాదాలతో మార్మోగుతోంది. ఈ సందర్భంగా సీజేపీ సోషల్ మీడియాలో స్పందిస్తూ, "ప్రజలు ఎన్నుకోవడం వల్లే ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ప్రజల పన్నుల ద్వారానే ఆయనకు జీతభత్యాలు అందుతున్నాయి. అయితే ఆయన విద్యామంత్రిగా ఉన్న కాలంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడిందని ఆరోపించింది.