NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'మోదీ' ఇంటిపేరుపై రాహుల్ గాంధీ ఆరోపణలు; రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు
    భారతదేశం

    'మోదీ' ఇంటిపేరుపై రాహుల్ గాంధీ ఆరోపణలు; రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు

    'మోదీ' ఇంటిపేరుపై రాహుల్ గాంధీ ఆరోపణలు; రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 23, 2023, 11:57 am 1 నిమి చదవండి
    'మోదీ' ఇంటిపేరుపై రాహుల్ గాంధీ ఆరోపణలు; రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు
    'మోదీ' ఇంటిపేరుపై రాహుల్ గాంధీ ఆరోపణలు; రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు

    లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2019లో మోదీ ఇంటి పేరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల నేపథ్యంలో అదే ఏడాది రాహుల్‌పై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్‌ మోదీ చేసిన ఫిర్యాదు మేరకు పరువు నష్టం కేసు నమోదైంది. అయితే ఈ కేసులో గురువారం సూరత్ కోర్టు ఎంపీ రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఆ తర్వాత రాహుల్‌కు కోర్టు బెయిల్ మంజురు చేసింది. చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ గతవారం ఇరుపక్షాల తుది వాదనలు విని, నాలుగేళ్ల నాటి పరువు నష్టం కేసులో తుది తీర్పును వెల్లడించారు. ఈ తీర్పు నేపథ్యంలో రాహుల్ గురువారం సూరత్ చేరుకున్నారు.

    2019లో కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ ఆరోపణలు

    బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్‌ మోదీ చేసిన ఫిర్యాదు ప్రకారం, 'దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎలా వచ్చింది?' అని రాహుల్ వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు 2019లో కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ ఈ ఆరోపణలు చేశారు. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై రాహుల్ తరఫున వాదించిన న్యాయవాది కిరీట్ పన్వాలా మాట్లాడుతూ.. సత్యం పరీక్షించబడుతుందన్నారు. రాహుల్‌పై అనేక తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. తనకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే అర్జున్ మోద్వాడియా అన్నారు. ఈ కేసులో రాహుల్‌పై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్లు 499, 500 (పరువు నష్టం)కింద కేసులు నమోదు చేశారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    గుజరాత్
    నరేంద్ర మోదీ
    రాహుల్ గాంధీ
    సూరత్

    గుజరాత్

    కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా?  దిల్లీ
    గుజరాత్‌లో రూ.4400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    డిఫరెంట్ ఫ్లేవర్లతో గోల్డెన్ ఐస్ క్రీమ్; ఎక్కడో తెలుసా?  సూరత్
    రాహుల్ గాంధీకి చుక్కెదురు; జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు సూరత్ కోర్టు నిరాకరణ  రాహుల్ గాంధీ

    నరేంద్ర మోదీ

    యూపీలో బీజేపీ 'ఖానే పే చర్చా'; 2024 సార్వత్రిక ఎన్నికలే మోదీ-యోగి టార్గెట్  ఉత్తర్‌ప్రదేశ్
    పార్లమెంట్ ప్రారంభోత్సవానికి గుర్తుగా విడుదల చేసిన రూ.75 నాణెం ప్రత్యేకతలు, ఎలా కొనాలి? దిల్లీ
    గువాహటి-న్యూ జల్‌పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    కొత్త పార్లమెంట్ భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ ప్రధాన మంత్రి

    రాహుల్ గాంధీ

    పాస్‌పోర్ట్ పొందేందుకు రాహుల్ గాంధీకి మూడేళ్లపాటు ఎన్ఓసీ ఇచ్చిన కోర్టు  దిల్లీ
    రాజీవ్ గాంధీ వర్ధంతి: సోనియా, ఖర్గే, ప్రియాంక నివాళి; రాహుల్ భావోద్వేగ ట్వీట్  కాంగ్రెస్
    సిద్ధరామయ్యను సీఎం చేసేందుకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు; మరి శివకుమార్ పరిస్థితి ఏంటి?  కర్ణాటక
    మోదీ కంటే ముందు రాహుల్ అమెరికా పర్యటన; 10రోజులు అక్కడే  నరేంద్ర మోదీ

    సూరత్

    పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీ తన బెయిల్ పిటిషన్‌లో చెప్పిన విషయాలు ఏంటంటే? రాహుల్ గాంధీ
    పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ మే 3వ తేదీకి వాయిదా రాహుల్ గాంధీ
    సూరత్ న్యాయస్థానం తీర్పును సవాల్ చేస్తూ నేడు సెషన్స్ కోర్టులో రాహుల్ అప్పీల్ రాహుల్ గాంధీ
    రాహుల్ గాంధీపై అనర్హత వేటు తప్పదా? నిపుణులు ఏం అంటున్నారు? ఆందోళనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ రాహుల్ గాంధీ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023