Page Loader
Rahul Gandhi : కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును సిఫార్సు చేసిన రాహుల్.. నితీష్ కుమార్‌కు ఫోన్
నితీష్ కుమార్‌కు ఫోన్

Rahul Gandhi : కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును సిఫార్సు చేసిన రాహుల్.. నితీష్ కుమార్‌కు ఫోన్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 22, 2023
02:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలోని ప్రతిపక్ష పార్టీల కూటమి ఇండియా బలాబలాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చర్చించారు. ఈ మేరకు కూటమి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పేరును రాహుల్ ప్రస్తావించారు. ఇరువురు జాతీయ నేతలు ఫోన్ ద్వారా చర్చించినట్లు తెలుస్తోంది. ఇండియా కూటెమి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే అంశంపై స్పందించిన రాహుల్ గాంధీ, ఇందుకు కాంగ్రెస్ సహకరిస్తుందని వెల్లడించారు. దీనిపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లు సైతం ఖర్గే పేరును ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో దేశానికి తొలి దళిత నేతను భారత ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించిన ఘనత దక్కుతుందని ఇండియా కూటమి సభ్యులు అభిప్రాయపడ్డారు.

Details

త్వరలోనే లోక్'సభ అభ్యర్థులను నిర్ణయిస్తాం : కాంగ్రెస్

ఈ ప్రకటనపై అటు ఎండీఎంకే నేత వైకోతో సహా పలువురు ఇండియా కూటమి నేతలు సైతం మద్ధతు పలికారు. మరోవైపు బిహార్‌ కేబినెట్‌లో కాంగ్రెస్ సభ్యుల సంఖ్యను పెంచుతానని నితీష్ కుమార్ హామీ ఇచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు తమ అభ్యర్థులను అతిత్వరలోనే నిర్ణయిస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. దిల్లీలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించింది. 2024 సార్వత్రిక ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని నేతలకు సూచించింది. రాహుల్ భారత్ జోడో యాత్ర 2.0 (తూర్పు-పశ్చిమం)కు సన్నాహాలు చేయాలని సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సమావేశానికి 76 మంది నేతలు హాజరుకాగా, దేశంలో కాంగ్రెస్ భవిష్యత్‌పై పార్టీ నాయకులు చర్చించారు.