Page Loader
Rahul Gandhi: అసోంలో రాహుల్ గాంధీ యాత్ర.. ఒక షరతు విధించిన సీఎం హిమంత శర్మ 
Rahul Gandhi: అసోంలో రాహుల్ గాంధీ యాత్ర.. ఒక షరతు విధించిన సీఎం హిమంత శర్మ

Rahul Gandhi: అసోంలో రాహుల్ గాంధీ యాత్ర.. ఒక షరతు విధించిన సీఎం హిమంత శర్మ 

వ్రాసిన వారు Stalin
Jan 23, 2024
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మేఘాలయ నుంచి తిరిగి మంగళవారం అసోంలోకి ప్రవేశించింది. అయితే గువాహటి పట్టణ రోడ్ల గుండా యాత్రను చేపట్టేందుకు హిమంత బిస్వా శర్మ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. యాత్రలో భాగంగా కాంగ్రెస్ నేతలు రోడ్లకు బ్లాక్‌లు సృష్టించారని ఆయన ఆరోపించారు. ఫలితంగా పట్టణ రహదారులు మరమ్మతులకు గురైనట్లు పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై అసోం సీఎం, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గువాహటి నగర రహదారుల గుండా యాత్రకు అనుమతించడం వల్ల ట్రాఫిక్ అంతరాయానికి దారితీయవచ్చని, అందుకే, 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'ను నగరం చుట్టూ రింగురోడ్డులా ఉండే 27వ జాతీయ రహదారిపై యాత్ర చేపట్టాలని అధికారులు సూచించారు.

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీని రావణుడితో పోల్చిన అసోం సీఎం

రాహుల్ గాంధీ సోమవారం అసోంలో 15వ శతాబ్దానికి చెందిన శ్రీమంత శంకరదేవ మఠానికి వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. రాహుల్ గాంధీని గుడిలోకి వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారని సీఎం హిమంత బిస్వా శర్మను విలేకరులు అడగ్గా.. ఈరోజు రావణుడి గురించి ఎందుకు మాట్లాడాలని అన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని హిమంత బిస్వా శర్మ రావణుడితో పోల్చడం గమనార్హం. రాహుల్ గాంధీని రావణుడితో పోల్చడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసోం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఇప్పటి వరకు ఎలాంటి నేరం చేయలేదన్నారు. రావణుడు ఎవరు? సీతను కిడ్నాప్ చేసిందెవరని ప్రశ్నించారు. నేడు దేశంలోనే అసోం మహిళలు అత్యంత అభద్రతగా ఉన్నారన్నారు.