LOADING...
INS Aridhaman: భారత్‌ నావికా దళంలోకి 'అరిదమన్‌' వచ్చేస్తోంది!
భారత్‌ నావికా దళంలోకి 'అరిదమన్‌' వచ్చేస్తోంది!

INS Aridhaman: భారత్‌ నావికా దళంలోకి 'అరిదమన్‌' వచ్చేస్తోంది!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 03, 2026
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

'ఐఎన్‌ఎస్ అరిధమన్' అనే భారత్ మూడో స్వదేశీ అణుశక్తి సబ్‌మెరైన్ త్వరలో సేవలోకి రానున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం సంకేతాలు ఇచ్చారు. "ఇది ఒక పదం కాదు, శక్తి - అరిధమన్" అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీర్ఘదూర క్షిపణులను మోసే సామర్థ్యంతో రూపొందిన ఈ సబ్‌మెరైన్, సముద్రాధారిత అణు నిరోధక శక్తిని మరింత బలపరచనుంది. ఇప్పటికే సముద్ర పరీక్షలన్నీ పూర్తి చేసిన అరిధమన్ త్వరలో స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్‌లో చేరనుంది. ముందుగా 2016లో సేవలోకి వచ్చిన ఐఎన్‌ఎస్ అరిహంత్, 2024 ఆగస్టులో చేరిన ఐఎన్‌ఎస్ అరిఘాట్‌ల సరసన ఇది మూడో అణు సబ్‌మెరైన్‌గా నిలుస్తుంది.

వివరాలు 

7,000 టన్నుల బరువుతో ఉన్న అరిధమన్

విశాఖపట్నం పర్యటనలో ఉన్న రాజ్‌నాథ్ సింగ్, భారత అణు సబ్‌మెరైన్‌లకు కేంద్రంగా ఉన్న ఈ నగరంలో స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ 'తరగిరి'ను కూడా నేడు నౌకాదళంలోకి చేర్చనున్నారు. సుమారు 7,000 టన్నుల బరువుతో ఉన్న అరిధమన్, ముందున్న వాటికంటే పెద్దదిగా, మెరుగైన స్టెల్త్ సామర్థ్యంతో రూపొందింది. ఇందులో బార్క్ అభివృద్ధి చేసిన 83 మెగావాట్ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ ఉపయోగించారు. ఈ సబ్‌మెరైన్‌లో 8 వర్టికల్ లాంచ్ ట్యూబ్‌లు ఉండగా, 3,500 కి.మీ పరిధి కలిగిన K-4 లేదా 750 కి.మీ పరిధి కలిగిన K-15 క్షిపణులను మోసే సామర్థ్యం ఉంది. అరిధమన్ సేవలోకి రావడంతో భారత్ నిరంతరం సముద్రంలో అణు నిరోధక పహారా నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుకోనుంది.

వివరాలు 

CODOG ఇంజిన్ వ్యవస్థతో రూపొందించిన తరగిరి'యుద్ధనౌక

శత్రువులు భూభాగం లేదా వైమానిక స్థావరాలపై దాడి చేసినా,సముద్రంలో దాగి ఉన్న సబ్‌మెరైన్ నుంచి ప్రతిదాడి చేసే'సెకండ్ స్ట్రైక్' సామర్థ్యం మరింత బలపడుతుంది. ప్రస్తుతం భారత్ వద్ద రెండు అణు సబ్‌మెరైన్‌లు ఉండగా,అరిధమన్ మూడోది. మరో నాల్గవ సబ్‌మెరైన్ కూడా త్వరలో చేరనుంది. ఇక 'తరగిరి'యుద్ధనౌక విషయానికి వస్తే,ఇది అధునాతన CODOG ఇంజిన్ వ్యవస్థతో రూపొందింది. వేగంగా ప్రయాణించడం,దీర్ఘకాలం సముద్రంలో ఉండటం దీని ప్రత్యేకత. తక్కువ రాడార్ గుర్తింపుతో పనిచేసే ఈ నౌకలో సూపర్‌సోనిక్ క్షిపణులు,ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు,యాంటీ సబ్‌మెరైన్ సిస్టమ్‌లు ఉన్నాయి. యుద్ధం మాత్రమే కాదు,సహాయక చర్యలు, విపత్తు సమయంలో సహాయం వంటి సేవలకూ ఇది ఉపయోగపడనుంది. స్వదేశీ సాంకేతికతతో తయారైన ఈ నౌక భారత నౌకాదళ శక్తిని మరింత పెంచనుంది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజ్‌నాథ్ సింగ్ చేసిన ట్వీట్ 

Advertisement