
Ayodya Ram Temple : రామాలయాన్ని పేల్చాస్తాం.. సీఎం యోగికి బాంబు బెదిరింపులు
ఈ వార్తాకథనం ఏంటి
అయోధ్యలో భవ్య రామాలయం (Ayodya Ram Temple) ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
ఈనెల 22న రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ క్రమంలో కొంతమంది దుండగులు మాత్రం రామాలయాన్ని పేల్చేస్తామంటూ బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
అదే విధంగా ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) పై బాంబుదాడులు చేస్తామని బెదిరించారు.
ఈ బెదిరింపులకు పాల్పడిన నిందితులను యూపీ స్పెషల్ టాస్క్ పోర్స్ బృందం గుర్తించింది.
నిందితులు లక్నోలోని విభూతి ఖండ్ ప్రాంతానికి చెందిన తాహర్ సింగ్, ఓం ప్రకాష్ మిశ్రాలుగా వెల్లడించారు.
బెదిరింపు పోస్టుల్లో నిందితులకు సంబంధించిన ఈమెయిల్ ఐడీలు ఉన్నట్లు తేలింది.
Details
ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేయనున్న ఎస్టీఎఫ్
ఇక తాహర్ సింగ్ ఈ మెయిల్ ఖాతాలను సృష్టించారని, ఓంప్రకాశ్ బెదిరింపు సందేశాలు పంపారని తేలింది.
నిందితులిద్దరూ పారామెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు.
ఈ విషయాన్ని ఎస్టీఎఫ్ మరింత లోతుగా విచారిస్తోంది.
నిందితులే సందేశాలను పంపారా? లేక దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.