
ఎండల నుంచి ఉపశమనం; ఉత్తర భారతం, దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో పాటు వాయువ్య భారతదేశంలో బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.
ఈ క్రమంలో ఎండలతో అల్లాడుతున్న వాయువ్య రాష్ట్రాల్లో వర్షాలతో చల్లబడనున్నాయి.
ముఖ్యంగా బుధ, గురువారాల్లో దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా సహా ఉత్తర భారత రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
ఈ క్రమంలో గురువారం వరకు ఉరుములు, మెరుపులు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఈ వర్షాల ప్రభావం దిల్లీ ఎన్సీఆర్‌పై ఎక్కువ చూపే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
ఐఎండీ
కేరళలో ఎల్లో అలర్ట్ జారీ
అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, సిక్కిం వంటి తూర్పు రాష్ట్రాల్లో శుక్రవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాజస్థాన్‌లో బుధవారం, గురువారం భారీ ఈదురు గాలులలు వీయనున్నట్లు ఐఎండీ చెప్పింది.
దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే వచ్చే ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
ముఖ్యంగా కేరళలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. మే 26, 27 తేదీల్లో కేరళలోని పతనంతిట్ట, ఇడుక్కి జిల్లాల్లో ఐఎండీ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కర్ణాటకలోనే 52మంది చనిపోయారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు.
బాధితులకు తక్షణమే సాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.