Dr.K.M Cherian: ప్రముఖ భారత హార్ట్ సర్జన్ ఎం.చెరియన్ కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత భారత హార్ట్ సర్జన్ డా. కే. ఎం. చెరియన్(82) శనివారం రాత్రి కన్నుమూశారు. చెరియన్ బెంగళూరులో ఓ పెళ్లిలో పాల్గొనడానికి వెళ్లిన సమయంలో అస్వస్థతకు గురయ్యారు.
వెంటనే మణిపాల్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ 11.55 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమార్తె సాంధ్యా చెరియన్ చెప్పారు. 1975లో ఇండియాలో తొలి ఆర్టరీ బైపాస్ సర్జరీ చేసిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.
దేశంలో మొదటి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్‌ను చేయడంతో పాటు, భారత్‌లో తొలి హార్ట్-లంగ్ ట్రాన్స్‌ప్లాంట్, పిల్లల హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన ఘనత ఆయనకు ఉంది.
చెరియన్ చెన్నైలోని రైల్వే ఆస్పత్రిలో సేవలు అందించిన తర్వాత, వివిధ ప్రైవేట్ ఆస్పత్రులలో పనిచేశారు.
Details
2005లో హార్వర్డ్ మెడికల్ ఎక్సలెన్స్ అవార్డు
విజయ ఆస్పత్రి, మద్రాస్ మెడికల్ మిషన్ లాంటి ఆస్పత్రుల్లో కూడా ఆయనకు పనిచేసిన అనుభవం ఉంది. అనంతరం ఫ్రంటియర్ లైఫ్‌లైన్, డా. చెరియన్ హార్ట్ ఫౌండేషన్ ను స్థాపించారు.
ప్రపంచ ప్రఖ్యాత సౌత్ ఆఫ్రికన్ హార్ట్ సర్జన్ క్రిస్టియన్ బార్నర్డ్‌తో కలిసి పనిచేసిన చెరియన్, 1990 నుండి 1993 వరకు భారత రాష్ట్రపతి హోదాలో గౌరవ సర్జన్‌గా కూడా సేవలందించారు.
అతనికి పద్మశ్రీ, 2005లో హార్వర్డ్ మెడికల్ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించారు.