Rajasthan: పోలీసుల కళ్లల్లో కారం చల్లి, గ్యాంగ్‌స్టర్‌ను కాల్చి చంపిన ప్రత్యర్థులు
హత్య కేసులో నిందితుడైన రాజస్థాన్ గ్యాంగ్‌స్టర్ కుల్దీప్ జఘినాను బుధవారం ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కస్డడీలో ఉన్న కుల్దీప్‌ను పక్కా ప్రణాళికతో కాల్చి చంపారు. పోలీసుల కళ్లల్లో కారం చల్లి, ఆ పరిస్థితిని అవకాశంగా తీసుకుని గ్యాంగ్‌స్టర్ కుల్దీప్ జఘినాను ప్రత్యర్థులు కాల్చేశారు. కుల్దీప్ జఘినాను జైపూర్ జైలు నుంచి భరత్‌పూర్ కోర్టుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై అమోలి టోల్ ప్లాజా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుల్దీప్ ఓ హత్య కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. కాల్పులు జరిపిన నిందితుల వాహనాలను సీజ్ చేశారు. బీజేపీ నాయకుడు కృపాల్ జఘినా హత్యకు ప్రతీకారంగా కుల్దీప్‌ను ప్రత్యర్థులు కాల్చి చంపారు.