Page Loader
Andhra Pradesh: జూన్‌లో రూ.8,500 కోట్ల రుణాలు.. బాండ్ల ద్వారా సేకరణ
జూన్‌లో రూ.8,500 కోట్ల రుణాలు.. బాండ్ల ద్వారా సేకరణ

Andhra Pradesh: జూన్‌లో రూ.8,500 కోట్ల రుణాలు.. బాండ్ల ద్వారా సేకరణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2025
01:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్ర ఆర్థికశాఖ కీలక పథకాలకు నిధుల సమీకరణపై దృష్టి సారించింది. ముఖ్యంగా రైతుభరోసా, రాజీవ్ యువవికాసం పథకాలకు నిధులు సమకూర్చేందుకు భారీ స్థాయిలో రుణాలను బహిరంగ మార్కెట్ నుంచి సేకరిస్తోంది. జూన్ 17 నాటికి మొత్తం రూ.8,500 కోట్లను సేకరించనుంది. ఇప్పటికే ఈ నెల 3న రూ.1,500 కోట్లు, 10న రూ.3,000 కోట్లు తీసుకోగా.. 17న మరో రూ.4,000 కోట్ల బాండ్లను వేలం వేయనుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయం కోసం రూ.9 వేల కోట్లకు పైగా కేటాయించాలని ఆర్థికశాఖ ప్రణాళిక వేసింది. రైతుభరోసా నిధుల కేటాయింపు అనంతరం, యువత కోసం రూపొందించిన 'రాజీవ్ యువవికాసం' పథకానికి రూ.6 వేల కోట్ల నిధులు కేటాయించాల్సి ఉంది.

Details

జూలై 1 నుంచి జీతాలు పెంచాల్సిన ఉంటుంది

లబ్ధిదారుల ఎంపిక పూర్తైన తర్వాతే ఈ పథకానికి నిధుల విడుదలపై స్పష్టత రానుంది. ఇక డీఏ పెంపుతో జులై 1 నుంచి జీతాలను పెంచి చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం రూ.300 కోట్లు అదనంగా అవసరం. పెండింగ్ బిల్లులకు నెలకు రూ.700 కోట్ల చొప్పున చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించిన నేపథ్యంలో ఈ రెండు అంశాలకు కలిపి ఈ నెలాఖరునాటికి రూ.1,000 కోట్ల అవసరం ఉన్నట్లు తెలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.54,009 కోట్ల రుణాలను లక్ష్యంగా పెట్టుకుంది.

Details

రూ.20వేల కోట్లు దాటే అవకాశం

ఇప్పటివరకు ఏప్రిల్‌లో రూ.5,230.99 కోట్లు, మేలో రూ.4,500 కోట్లు, జూన్ 17 వరకు మరో రూ.8,500 కోట్లు సేకరించి మొత్తంగా రూ.18,230 కోట్లు సమీకరించింది. నెలాఖరు నాటికి ఈ మొత్తము రూ.20 వేల కోట్లు దాటే అవకాశముంది. వేరే ఆదాయ మార్గాలకూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ శాఖల ద్వారా వసూళ్లలో అక్రమాలను నియంత్రించి ఆదాయాన్ని పెంచాలని సూచించింది. అలాగే రిజిస్ట్రేషన్ల వృద్ధి ద్వారా కూడా ఆదాయం పెరుగుతుందని ఆర్థికశాఖ అంచనా వేస్తోంది.