LOADING...
KCR: కేసీఆర్ కుటుంబంలో విషాద ఛాయలు.. సోదరి సకలమ్మ మృతి
కేసీఆర్ కుటుంబంలో విషాద ఛాయలు.. సోదరి సకలమ్మ మృతి

KCR: కేసీఆర్ కుటుంబంలో విషాద ఛాయలు.. సోదరి సకలమ్మ మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2025
08:45 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్) కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసిఆర్ సోదరి అనారోగ్యంతో మరణించారు. కేసీఆర్ ఐదోవ సోదరి, కేటీఆర్ మేనత్త, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు తల్లి చీటీ సకలమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె భౌతికకాయానికి నివాళులర్పించేందుకు కేసీఆర్ మేడ్చల్ సమీపంలోని ఆమె నివాసానికి వెళ్లనున్నారు.

Details

ఇవాళ సకలమ్మ అంత్యక్రియలు

గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సకలమ్మ హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆస్పత్రికి వెళ్లారు. ఆమె భౌతికకాయాన్ని ఓల్డ్ అల్వాల్‌లోని టీఎస్‌ఆర్ గోల్డెన్ లీఫ్ అపార్ట్‌మెంట్‌కు తరలించారు. శనివారం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.