Penukonda Municipality: పెనుకొండ మున్సిపాలిటీలో కూటమి క్లీన్ స్వీప్.. 23 వార్డుల్లో విజయం
ఈ వార్తాకథనం ఏంటి
సత్యసాయి జిల్లా పెనుకొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. మొత్తం 23 వార్డుల్లోనూ గెలుపొందారు. ఈ విజయంతో మున్సిపాలిటీలో కూటమి తన పట్టును నిరూపించుకుంది.
వివరాలు
23 వార్డుల్లో గెలిచిన అభ్యర్థులు వీరే..
1 టీడీపీ హనుమంత్
2 టీడీపీ గిరి
3 టీడీపీ కొమ్ము వెంకటేష్
4 టీడీపీ హరి
5 బీజేపీ మూర్తి
6 టీడీపీ షౌకత్
7 టీడీపీ దాదు షేరింతాజ్
8 టీడీపీ బర్కత్
9 టీడీపీ షాబిరా బాను
10 టీడీపీ బోయ నాగలక్ష్మమ్మ
11 టీడీపీ హుజూరుల్లా ఖాన్
12 టీడీపీ నరేంద్ర హేమలత
13 జనసేన శబరిష్ సాహితి
14 టీడీపీ రమణమ్మ
15 టీడీపీ హేమావతి
16 టీడీపీ షామి ఉల్లా
17 టీడీపీ బాబుల్ రెడ్డి
18 టీడీపీ రంజిత్ రెడ్డి
19 టీడీపీ వడ్డీ నిర్మల
20 టీడీపీ ప్రమీలరవి
21 టీడీపీ రామలింగ
22 టీడీపీ చంద్రకాంతమ్మ
23 టీడీపీ సుకన్య
వివరాలు
పెనుకొండ గెలుపులో మంత్రి సవిత వ్యూహాలు
పెనుకొండ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించడం వెనుక మంత్రి సవిత అనుసరించిన రాజకీయ వ్యూహాలు కీలకంగా నిలిచాయి.
చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక కోసం ఆమె సిక్స్ మ్యాన్ కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ అభ్యర్థుల గురించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత ప్రజాదరణ ఉన్నవారిని ఎంపిక చేసింది.
తాజాగా విజయం సాధించిన 23 మంది అభ్యర్థులూ ఈ కమిటీ ఎంపిక చేసినవారే కావడం గమనార్హం.