Page Loader
కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీల మధ్య పొత్తు కుదరనట్టేనా? 
కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీల మధ్య పొత్తు కుదరనట్టేనా?

కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీల మధ్య పొత్తు కుదరనట్టేనా? 

వ్రాసిన వారు Stalin
Feb 20, 2024
07:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్ష కూటమి భారత్‌కు మరో పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ), కాంగ్రెస్‌ల మధ్య పొత్తు వీగిపోయేలా కనిపిస్తోంది. సీట్ల పంపకానికి సంబంధించి ఇరు పార్టీల మధ్య చర్చలు దాదాపు ముగిశాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 17 సీట్లు ఇవ్వాలని ఎస్పీ ప్రతిపాదించిందట. అయితే కాంగ్రెస్ అడిగిన 3 సీట్లను మాత్రం వదులుకునేందుకు ఎస్పీ సిద్ధంగా లేదట. ఈ మూడు సీట్ల విషయంలో కుదరకపోవడంతో యూపీలో ఇండియా కూటమికి బీటలు వారే పరిస్థితి కనపడుతోంది.

కాంగ్రెస్

ఆ మూడు సీట్లు ఇవే

యూపీలోని అమేథీ, రాయ్‌బరేలీ, బారాబంకి, సీతాపూర్, కైసర్‌గంజ్, వారణాసి, అమ్రోహా, సహరన్‌పూర్, గౌతమ్ బుద్ధ నగర్, ఘజియాబాద్, బులంద్‌షహర్, ఫతేపూర్ సిక్రీ, కాన్పూర్, హత్రాస్, ఝాన్సీ, మహరాజ్‌గంజ్, బాగ్‌పత్‌లను ఇవ్వాలని ఉఎస్పీ నిర్ణయించినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్ మొరాదాబాద్, బిజ్నోర్, బల్లియా స్థానాలను కూడా కోరుతుండగా, అఖిలేష్ యాదవ్ అందుకు సిద్ధంగా లేరట. గత ఎన్నికల్లో మొరాదాబాద్, బల్లియా స్థానాలను ఎస్పీ గెలుచుకోవడంతో బిజ్నోర్ స్థానంలో తమ అభ్యర్థిని నిలబెట్టాలని ఎస్పీ భావిస్తోంది.

కాంగ్రెస్

రాహుల్ గాంధీ పర్యటనకు అఖిలేష్ గైర్హాజరు

రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మంగళవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చేరుకోగా.. అఖిలేష్ అందులో పాల్గొనలేదు. సీట్ల పంపకంపై అంగీకారం తెలిపిన తర్వాతే కాంగ్రెస్ యాత్రలో చేరతానని అఖిలేష్ సోమవారం స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్‌తో పాటు పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీట్లు పంచుకోవడానికి నిరాకరించాయి. ఇదిలా ఉంటే, ఎస్పీ సోమవారం లోక్‌సభ ఎన్నికలకు 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అంతకుముందు 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 27 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.