Page Loader
Mahakumbhamela: మహా కుంభమేళాలో భాగంగా ఈ నెల 29న రెండో 'అమృత్‌ స్నాన్‌' 
మహా కుంభమేళాలో భాగంగా ఈ నెల 29న రెండో 'అమృత్‌ స్నాన్‌'

Mahakumbhamela: మహా కుంభమేళాలో భాగంగా ఈ నెల 29న రెండో 'అమృత్‌ స్నాన్‌' 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2025
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో భాగంగా, ఈ నెల 29న రెండో 'అమృత్‌ స్నాన్‌'ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మౌని అమావాస్య రోజున జరిగే ఈ పవిత్ర క్రతువులో సుమారు 8-10 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. 144 ఏళ్ల తర్వాత గ్రహాల అరుదైన కలయిక ఏర్పడనున్న నేపథ్యంలో, ఈ స్నానానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. దీని కారణంగా భారీ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.

వివరాలు 

మరోసారి అగ్నిప్రమాదం 

ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని,అఖిల భారతీయ అఖాడా పరిషద్‌ (ఏబీఏపీ) అఖాడాల (సాధువులు)కు ప్రత్యేక సూచనలు పంపింది. 'అమృత్‌ స్నాన్‌' కోసం 13 లక్షల అఖాడాలు తమకు కేటాయించిన సమయంలోనే త్రివేణి సంగమంలో స్నానమాచరించాలని వారు సూచించారు. ఇది ఇతర భక్తులకు అసౌకర్యం కలగకుండా నిర్వహించేందుకు తీసుకున్న చర్య అని చెప్పారు. 12 కిలోమీటర్ల పొడవు ఉన్న స్నాన ఘాట్‌లో భక్తులు గుమికూడకుండా,మొత్తం స్థలాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని ఏబీఏపీ అభ్యర్థించింది. ఇక, మహా కుంభమేళాలో సోమవారం ఉదయం సెక్టార్‌ 16లోని కిన్నర్‌ అఖాడా క్యాంపు సమీపంలో ఒక టెంట్‌లో స్వల్ప స్థాయిలో మంటలు ఎగసిపడ్డాయి. తక్షణమే అక్కడ ఉన్నవారు అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు.ఆదివారం కూడా అక్కడ భారీ మంటలు వ్యాపించాయని అధికారులు తెలిపారు.

వివరాలు 

12 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి అవకాశాలు

మహా కుంభమేళా సందర్భంగా 12 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి అవకాశాలు కల్పించబడుతున్నాయి. ఈ మేళా ఈ నెల 13న ప్రారంభమై, ఫిబ్రవరి 26 వరకు 45 రోజులపాటు కొనసాగనుంది. గ్లోబల్‌ టెక్నాలజీ అండ్‌ డిజిటల్‌ టాలెంట్‌ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్‌ ప్రకారం, ఈ మహాక్రతువుతో 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాల సృష్టి జరిగింది. పర్యాటక, ఆతిథ్య, రవాణా, వైద్య, సైబర్‌ సెక్యూరిటీ, ఆహార ఉత్పత్తుల రంగాలలో వారికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు.