Loading...
PM Modi: సేవే ధర్మం.. యాంబిషన్‌ కోసం కాదు మిషన్‌ కోసం జీవిస్తున్నా: ప్రధాని మోదీ
సేవే ధర్మం.. యాంబిషన్‌ కోసం కాదు మిషన్‌ కోసం జీవిస్తున్నా: ప్రధాని మోదీ

PM Modi: సేవే ధర్మం.. యాంబిషన్‌ కోసం కాదు మిషన్‌ కోసం జీవిస్తున్నా: ప్రధాని మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2026
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 25ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన సుదీర్ఘ రాజకీయ,ప్రజాసేవా ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. 2001 అక్టోబర్‌ 7న గుజరాత్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇంత సుదీర్ఘ ప్రయాణం సాగుతుందని,ఈ స్థాయికి చేరుకుంటానని అప్పట్లో తాను ఊహించలేదన్నారు. ప్రతి విజయం తనలో మరింత సాధించగలననే విశ్వాసాన్ని పెంచిందని పేర్కొన్నారు. ఢిల్లీలో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఎన్నికలు అయినా,సాధారణ ఎన్నికలు అయినా ప్రజలు తనపై విశ్వాసం ఉంచారని చెప్పారు. అదే రోజు ఉదయం దేశ ప్రజలందరి కోసం వినాయకుడిని ప్రార్థించినట్లు వెల్లడించారు.

వివరాలు 

ఇప్పటికీ విద్యార్థినే..

ప్రజలకు మరింత సమర్థంగా సేవ చేయడానికి శక్తిని ప్రసాదించాలని కోరుకున్నానన్నారు.

''నాకు ప్రజలే భగవంతుడి స్వరూపం. ఈ దేశం నాకు ఎంతో ఇచ్చింది. అందుకే దేశమే నా తొలి ప్రాధాన్యం'' అని మోదీ స్పష్టం చేశారు.

తనను తాను ఇప్పటికీ విద్యార్థిగానే భావిస్తానని ప్రధాని చెప్పారు.

చిన్నతనంలో వడోదరలో కాకుండా వడ్నగర్‌లో పాఠశాలకు వెళ్లిన రోజులను గుర్తు చేసుకున్నారు.

తరగతి గదికి అందరికంటే ముందుగా చేరే విద్యార్థుల్లో తానూ ఒకడినని తెలిపారు.

అప్పటి నుంచే కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి తనలో పెరిగిందన్నారు.

ఎంత ఎక్కువగా నేర్చుకుంటే దేశానికి సేవ చేసే సామర్థ్యం అంతగా పెరుగుతుందని మోదీ చెప్పారు.

అందుకే ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తానన్నారు.

వివరాలు 

భుజ్‌ భూకంపం నుంచి చంద్రయాన్‌ వరకు..

25 ఏళ్ల ప్రజాసేవా ప్రయాణంలో ఎదురైన ప్రతి సవాలు తనకు ఒక పాఠాన్ని నేర్పిందని వివరించారు.

ప్రతి విజయం మరింత బాధ్యతను తీసుకువచ్చిందని, ప్రతి సాధన పెద్ద లక్ష్యాల దిశగా అడుగులు వేసేందుకు ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పారు.

తన మద్దతుదారులు ప్రోత్సాహాన్ని అందిస్తే.. విమర్శకులు తన పనితీరును తాను సమీక్షించుకునేలా చేశారని పేర్కొన్నారు.

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఎదురైన భుజ్‌ భూకంపం తనకు పట్టుదలతో పునర్నిర్మాణం చేపట్టడం నేర్పిందని మోదీ గుర్తుచేసుకున్నారు.

చంద్రయాన్‌ ప్రయోగంలో ఎదురైన వైఫల్యం నుంచి మళ్లీ లేచి ముందుకు సాగడం నేర్చుకున్నానన్నారు.

కరోనా మహమ్మారి దేశ సమష్టి చైతన్యం, ఐక్యత ఎంత ముఖ్యమో తెలియజేసిందని చెప్పారు.

ADVERTISEMENT

వివరాలు 

సేవే ధర్మం.. దేశమే తొలి ప్రాధాన్యం

తన సుదీర్ఘ ప్రయాణంలో ఎదురైన తీపి, చేదు అనుభవాల మధ్య ముందుకు సాగేందుకు మీడియా కూడా తనకు ప్రేరణగా నిలిచిందని మోదీ పేర్కొన్నారు.

తన 25 ఏళ్ల ప్రస్థానంలో సహకరించిన ఎన్డీయే మిత్రపక్షాలు, బీజేపీ, రాజకీయ సహచరులు, తనపై నమ్మకం ఉంచిన దేశ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

''సేవే ధర్మం. నేను యాంబిషన్‌ కోసం కాదు.. మిషన్‌ కోసం జీవిస్తున్నా'' అని ఆయన స్పష్టం చేశారు.

వేల ఏళ్ల చరిత్ర, గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన దేశానికి సేవ చేసే అవకాశం దక్కడం తనకు ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

''మనం సాధిస్తాం.. తప్పకుండా సాధిస్తాం''

25 ఏళ్ల ప్రయాణం కేవలం గతాన్ని గుర్తుచేసుకునే సందర్భం మాత్రమే కాదని మోదీ చెప్పారు.

భవిష్యత్తు కోసం తీసుకున్న సంకల్పాన్ని మరోసారి బలంగా చాటుకునే సమయమని పేర్కొన్నారు.

2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధించడంతో పాటు ప్రపంచంలోని టాప్‌-3 ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ను నిలబెట్టాలన్న లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు.

''మనం సాధిస్తాం.. తప్పకుండా సాధిస్తాం'' అంటూ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.

25 ఏళ్ల ప్రజాసేవా ప్రయాణం 2001 అక్టోబర్‌ 7న గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారంతో ప్రారంభమైంది.

ADVERTISEMENT