తదుపరి వార్తా కథనం

Vizag Accident: స్కూలు పిల్లల ఆటోను ఢీకొట్టిన లారీ.. ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు
వ్రాసిన వారు
Stalin
Nov 22, 2023
11:29 am
ఈ వార్తాకథనం ఏంటి
పిల్లలు స్కూల్‌కు వెళ్తున్న ఆటోను లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వైజాగ్‌లోని సంగం శరత్ థియేటర్ సమీపంలో జరిగింది.
విశాఖలోని బేతని స్కూల్ విద్యార్థులు ఆటో వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
లారీ ఢీకొట్టిన తర్వాత ఆటో ఫల్టీలు కొట్టి.. నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను స్థానికులు వెంటనే సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి చికిత్సను అందిస్తున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేసుకొని కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్, క్లీనర్‌ను అరెస్టు చేశారు. లారీని సీజ్ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆటోను లారీ ఢీకొట్టిన దృశ్యం
Black day ⚫
— 🇲 🇧 🇵 🇷 🇦 🇸 🇦 🇩 (@prasadhoni98) November 22, 2023
Today
At vizag Sangam theatre
Big accident 😭😭 pic.twitter.com/p0BY6plZIn