Delhi: ఢిల్లీలో కూలిన మూడంతస్తుల బిల్డింగ్.. శిథిలాల కింద పలువురు.!
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో మరో భవనం కుప్పకూలింది. పాత ఢిల్లీలోని చావ్రీ బజార్‌లో గురువారం ఉదయం నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. చావ్రీ బజార్ మెట్రో స్టేషన్ సమీపంలోని గలీ సితారాలో ఉదయం 9.50 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు అగ్నిమాపక వాహనాలతో పాటు నీటిని పంపే వాహనాలు, సహాయక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
వివరాలు
ఈశాన్య ఢిల్లీలోని భవనంలో రెండు స్లాబులు కూలి..
కొద్ది రోజుల క్రితమే ఈశాన్య ఢిల్లీలోని ఓ భవనంలో రెండు స్లాబులు కూలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
మిలన్ గార్డెన్ ప్రాంతంలో పాత ఇంటిపై కొత్త అంతస్తు నిర్మిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
నిర్మాణ పనుల సమయంలో పాత ఇంటి పైకప్పులో కొంత భాగం కూలిపోవడంతో దాని పైన ఉన్న స్లాబ్ కూడా కూలినట్లు సమాచారం.
ఈ ఘటనలో చంద్రపాల్ (60), విజయ్ కుమార్ (33) శిథిలాల కింద చిక్కుకున్నారు.
సహాయక సిబ్బంది వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
వివరాలు
ఆమ్ ఆద్మీ పార్టీ నేత విమర్శలు
తాజా ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌పై విమర్శలు చేశారు.
సెప్టెంబర్ 6న దక్షిణ ఢిల్లీలోని సత్య నికేతన్‌లో బాలుర పేయింగ్ గెస్ట్ వసతి గృహంగా నడుస్తున్న భవనం కూలిన తర్వాత ఎంసీడీ భవనాల భద్రతపై తనిఖీలు చేపట్టింది.
అయితే, ఆ తనిఖీలు జరిగినా భవనాలు ఎందుకు కూలుతున్నాయని భరద్వాజ్ ప్రశ్నించారు.
ఢిల్లీలోని అన్ని భవనాలకు భద్రతా తనిఖీలు నిర్వహించినట్లు ప్రభుత్వం, ఎంసీడీ చెబుతున్నప్పటికీ ఇలాంటి ప్రమాదాలు కొనసాగుతున్నాయని విమర్శించారు.