Delhi: న్యూఇయర్ వేళ హస్తినలో ఘోరం.. భార్య వేధింపులతో కేఫ్ యజమాని ఆత్మహత్య
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం దేశంలో భార్యల వేధింపులు తీవ్ర చర్చకు దిగుతున్నాయి.
చాలా సందర్భాల్లో, అర్ధాంగి పెట్టె వేధింపులకు ఆత్మహత్య చేసుకుంటున్న భర్తల సంఘటనలు దేశాన్ని కలవరపెడుతున్నాయి.
కొద్దిరోజుల క్రితం, బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అతుల్ సుభాష్ 40 పేజీల లేఖ రాసి, తన భార్య, అత్తమామల వేధింపుల కారణంగా చనిపోతున్నట్లు వెల్లడించాడు.
ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. తాజా ఘటనలు కూడా ఇదే తరహాలో చోటు చేసుకున్నాయి.
ఢిల్లీలో ఒక కేఫ్ యజమాని తన ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అతను ఆడియోలో, భార్య, అత్తమామల వేధింపుల కారణంగా తన ప్రాణాలు తీసుకున్నట్లు తెలిపాడు. కొత్త సంవత్సరం ఆరంభంలో ఈ సంఘటన కలకలం రేపింది.
వివరాలు
బేకరీ బిజినెస్‌లో కొన్ని సమస్యలు
పునీత్ ఖురానా (40),మాణికా జగదీష్ పహ్వా మధ్య వివాహం 2016లో జరిగింది. సంతోషంగా ప్రారంభమైన వారి సంసారంలో ఒక్కసారిగా ఆటుపోట్లు ఎదురయ్యాయి.
వారిద్దరూ కలిసి నడుపుతున్న బేకరీ బిజినెస్‌లో కొన్ని సమస్యలు వచ్చాయి.
ఈ విషయాల కారణంగా, కుటుంబంలో నెమ్మది నెమ్మదిగా గొడవలు మొదలయ్యాయి.
ఈ సమస్యలు తీవ్రంగా మారడంతో చివరకు పునీత్ ఖురానా తన ప్రాణాలు తీసుకున్నాడు.
ఢిల్లీలోని మోడల్ టౌన్, కళ్యాణ్ విహార్ ప్రాంతంలోని తన గదిలో ఉరివేసుకుని చనిపోయాడు.
పునీత్ తన ఫోన్‌లో 59 నిమిషాల వీడియో రికార్డ్ చేసి, భార్య, ఆమె సోదరి, అత్తమామల వేధింపులు కారణంగా చనిపోతున్నట్లు వెల్లడించాడు.
వివరాలు
పునీత్ ఖురానా,మాణికా జగదీష్ పహ్వా విడాకుల కోసం దరఖాస్తు
ఇదిలా ఉంటే , పునీత్ ఖురానా,మాణికా జగదీష్ పహ్వా విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సమయంలో పునీత్ తన ప్రాణాలు తీసుకున్నాడు, ఇది అతని కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.
పునీత్ తల్లి, సోదరి కన్నీటిపర్యంతమయ్యారు. భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగానే ఈ సంఘటన జరిగిందని వారు ఆరోపించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వివరాలు
ఆస్తి గొడవల వివాదం
భాదితుడి ప్రాణాలు తీసుకోవడానికి కారణం భార్యతో వ్యాపార సంబంధమైన ఆస్తి గొడవల వివాదం అని భావిస్తున్నారు.
పునీత్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, భార్యను విచారణ కోసం పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇటువంటి సంఘటనలు, అంటే భార్యల వేధింపుల కారణంగా చనిపోవడం, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
2024 డిసెంబర్‌లో బెంగళూరులో అతుల్ సుభాష్, ఇప్పుడు ఢిల్లీలో పునీత్ ఖురానా సంఘటనలు చోటుచేసుకోవడం, చర్చనీయాంశం అవుతున్నాయి.