Sheena Bora: షీనా బోరా కేసు.. ఇంద్రాణీ ముఖర్జీ విదేశీ పర్యటనకు సుప్రీం కోర్టు నో!
ఈ వార్తాకథనం ఏంటి
షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణీ ముఖర్జీకి విదేశీ పర్యటనపై సుప్రీం కోర్టులో చుక్కెదురైంది.
బుధవారం ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టిపారేసింది.
ఈ కేసు విచారణ ఆలస్యమవుతోందన్న కారణంగా ట్రయల్ కోర్టుపై సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తిని వ్యక్తం చేసింది.
సుప్రీం కోర్టు తీర్పు
ఇంద్రాణీ ముఖర్జీ విదేశాలకు వెళ్లకుండా గతంలో బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే 2024 నవంబర్‌లో ఆమె ఆ ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. దీనిపై జస్టిస్ ఎంఎం సుందరేష్, రాజేష్ బిందాల్ ధర్మాసనం విచారణ జరిపి, ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.
Details
సీబీఐ వాదనలు
అంతేకాకుండా కేసు విచారణలో జాప్యం ఉండటంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణను ఏడాదిలోపు పూర్తి చేయాలని ట్రయల్ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.
ఇది అత్యంత సున్నితమైన కేసు
విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది
ఇప్పటివరకు 96 మంది సాక్ష్యులను విచారించాం
ఇంద్రాణీకి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం సరైనది కాదు
ఇంద్రాణీ ముఖర్జీ తరఫు వాదనలు
సుప్రీంకోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది
ఇంకా 96 మంది సాక్ష్యులను విచారించాల్సి ఉంది
ట్రయల్ కోర్టులో విచారణ జరిపే బెంచ్ నాలుగు నెలలుగా ఖాళీగా ఉంది
విచారణ మరింత ఆలస్యం కావచ్చు, అందుకే విదేశీ ప్రయాణానికి అనుమతి ఇవ్వాలి
Details
సుప్రీం కోర్టు నిర్ణయం
సీబీఐ వాదనలను సమర్థించిన ధర్మాసనం, ఇంద్రాణీ ముఖర్జీ పిటిషన్‌ను తిరస్కరించింది.
షీనా బోరా కేసు నేపథ్యం
ముంబై మెట్రో వన్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న షీనా బోరా (22) 2012, ఏప్రిల్ 24న అదృశ్యమైంది. తర్వాత ఆమె హత్యకు గురైనట్లు తేలింది.
ఈ హత్యకు ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జీనే సూత్రధారి అని దర్యాప్తులో తేలింది. తన రెండో భర్త సంజీవ్ ఖన్నాతో కలిసి ఈ హత్యకు కుట్రపన్నిందని పోలీసులు వెల్లడించారు.
Details
షీనా బోరా కేసు టైమ్‌లైన్
ఏప్రిల్ 24, 2012: షీనా బోరా అదృశ్యం
ఆగష్టు 21, 2015: డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్ అరెస్ట్, నేరం ఒప్పుకోలు
ఆగష్టు 25, 2015: ఇంద్రాణీ ముఖర్జీ అరెస్ట్
ఆగష్టు 26, 2015: షీనా మాజీ భర్త సంజీవ్ ఖన్నా అరెస్ట్
సెప్టెంబర్ 1, 2015: షీనా అసలు తండ్రిగా సిద్ధార్థ్ దాస్ ప్రకటన
- సెప్టెంబర్ 18, 2015: కేసు సీబీఐకు అప్పగింత
నవంబర్ 19, 2015: పీటర్ ముఖర్జీ అరెస్ట్, ఛార్జ్‌షీట్ దాఖలు
ఫిబ్రవరి 16, 2016: పీటర్ ముఖర్జీ పేరు ఛార్జ్‌షీట్‌లో నమోదు
జనవరి-ఫిబ్రవరి 2017: విచారణ ప్రారంభం
Details
షీనా బోరా కేసు టైమ్‌లైన్ (2)
అక్టోబర్ 2019: ఇంద్రాణీ, పీటర్ ముఖర్జీలకు విడాకులు
మార్చి 2020: పీటర్ ముఖర్జీకి బెయిల్ మంజూరు
మే 18, 2022: సుప్రీం కోర్టు ఇంద్రాణీ ముఖర్జీకి బెయిల్ మంజూరు, ఆరేళ్ల తర్వాత విడుదల
ఫిబ్రవరి 12, 2025 విదేశీ పర్యటనకు అనుమతి కోరిన పిటిషన్ కొట్టివేత, విచారణను ఏడాదిలోపు ముగించాలన్న సుప్రీం కోర్టు ఆదేశం