
Singareni : సింగరేణి కీలక నిర్ణయం.. తీవ్ర కాలేయ వ్యాధిగ్రస్తులకు సగం జీతంతో సెలవులు
ఈ వార్తాకథనం ఏంటి
తీవ్ర కాలేయ వ్యాధి (లివర్ సిరోసిస్)తో బాధపడుతున్న కార్మికులకు ఊరట కలిగించే కీలక నిర్ణయాన్ని సింగరేణి యాజమాన్యం తీసుకుంది.
గురువారం నాడు జారీ చేసిన తాజా ఉత్తర్వుల మేరకు, ఈ వ్యాధిగ్రస్తులకు సగం జీతంతో కూడిన ప్రత్యేక సెలవులను మంజూరు చేయనున్నారు.
ఇప్పటివరకు ఈ ప్రత్యేక సెలవులు కేవలం ఏడు తీవ్ర వ్యాధులకు మాత్రమే వర్తింపజేస్తుండేవారు.
అవి: - గుండె సంబంధిత వ్యాధులు - క్షయ - క్యాన్సర్ - కుష్టు - పక్షవాతం - మూత్ర కోశ వ్యాధులు - ఎయిడ్స్ - మెదడు సంబంధిత వ్యాధులు
Details
సిరోసిస్ వ్యాధిగ్రస్తులకు స్పెషల్ లీవులు
అయితే తాజాగా కోల్ ఇండియా స్థాయిలో నిర్వహించిన NCWA (నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్) 11వ వేతన ఒప్పందం లో లివర్ సిరోసిస్ వ్యాధిగ్రస్తులకు కూడా ఈ స్పెషల్ లీవ్ వర్తింపచేయాలని ప్రకటించారు.
దీన్ని అనుసరించడంతో సింగరేణి యాజమాన్యం లివర్ సిరోసిస్‌ను అధికారికంగా స్పెషల్ లీవ్"కు అర్హత కలిగిన వ్యాధుల జాబితాలో చేర్చింది.
సర్క్యులర్‌లో పేర్కొన్న ప్రకారం, తీవ్ర కాలేయ వ్యాధితో బాధపడే కార్మికుడు వ్యాధి నయం అయ్యి విధులకు ఫిట్ అయ్యేంతవరకు ఈ సెలవు పొందవచ్చు.
ఈ కాలంలో అతనికి 50 శాతం జీతం (బేసిక్ పే, డియర్‌నెస్ అలవెన్స్ చెల్లించనున్నారు. ఈ నిర్ణయం ద్వారా, తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్మికులకు కొంత ఆర్థిక ఊరట లభించనుంది.