Page Loader
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో వేగం పెంచిన సిట్‌.. ప్రభాకర్, ప్రణీత్‌లను ఒకేసారి విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో వేగం పెంచిన సిట్‌.. ప్రభాకర్, ప్రణీత్‌లను ఒకేసారి విచారణ

Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో వేగం పెంచిన సిట్‌.. ప్రభాకర్, ప్రణీత్‌లను ఒకేసారి విచారణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2025
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ దిశగా దూకుడును పెంచిన సిట్ అధికారులు, కీలక నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులను ఒకేసారి ముఖాముఖీగా విచారించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. 'నాకు ఏమీ తెలియదు' అని నిరాకరిస్తున్న ప్రభాకర్ రావు - ప్రభాకర్ రావే ఆదేశించారని చెప్పిన ప్రణీత్ రావు వాఖ్యాల మధ్య భారీ విభేదాలు రావడంతో... ఇద్దరినీ కలిపి చుట్టాలేనిదే అసలు నిజాలు వెలుగులోకి రావని సిట్ అధికారులు భావిస్తున్నారు. అమెరికా నుంచి ప్రభాకర్ రావు తిరిగిరాగానే ఈ కేసులో కీలకమైన మలుపు వస్తుందని భావించినా, ఆయన తిరిగి వచ్చిన వెంటనే "ఏమీ గుర్తులేదు, శాఖాపరమైన ఆదేశాలకే పరిమితమయ్యాను" అంటూ సిట్‌ను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడన్న ఆరోపణలున్నాయి.

Details

ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్

అంతేకాదు సిట్ అధికారులను ఆయననే ప్రశ్నించడం విశేషం. "ఈ ట్యాపింగ్ కేసులో ఉన్నతాధికారులను ఎందుకు విచారించటం లేదు?" అనే ప్రశ్నను ప్రభాకర్ రావు అధికారుల ముందే వినిపించాడట. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులు ప్రభాకర్ రావే ట్యాపింగ్ ఆదేశాలు ఇచ్చాడని స్పష్టం చేశారు. తామంతా అతని మార్గదర్శకత్వంలోనే ఈ చర్యలకు పాల్పడ్డామని చెప్పినట్లు ఆధారాలు పోలీసుల వద్ద ఉన్నాయి. అయినా ప్రభాకర్ రావు మాత్రం తన పాత్రను పూర్తిగా తిరస్కరించడమే కాకుండా సిట్ విచారణను తక్కువచేస్తున్నట్టు వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో, సిట్ ఈసారి మరింత కఠినంగా వ్యవహరించింది. ముందుగా ప్రణీత్ రావును విచారించి, అతనివద్ద నుంచి ప్రభాకర్ రావు ఇచ్చిన ఆదేశాల వివరాలు రికార్డు చేసింది.

Details

త్వరలోనే మరిన్ని విషయాలు వెలుగులోకి

అనంతరం ప్రభాకర్ రావును విచారణకు పిలిపించి, ప్రణీత్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఎదురుగా ఉంచి ప్రశ్నలు సంధించింది. మధ్యాహ్నం తర్వాత ప్రణీత్ రావునూ సిట్ కార్యాలయానికి పిలిపించి... ఇద్దరినీ ఒకేసారి విచారించేందుకు ఏర్పాట్లు చేశారు. అంతేకాదు సిట్ అధికారులు ప్రభాకర్ రావును రెండోసారి విచారణకు పిలుస్తూ, అతని వాడిన రెండు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌, మ్యాక్‌బుక్‌ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తెచ్చేయాలని స్పష్టం చేశారు. ఆయన అందించిన ఫోన్ల నుంచి ఆధారాలు లభిస్తే, అవి విచారణలో కీలకంగా మారనున్నాయి. ఈ ఆధారాల ఆధారంగా మళ్లీ ప్రభాకర్ రావును నిలదీసేందుకు సిట్ సిద్ధమవుతోంది. మొత్తానికి, ఈ కేసులో అసలు పావులు ఎవరు? ఆదేశాల వెనుక నడిచిన ముప్పులు ఏమిటో త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.