LOADING...
Sri Rama Navami : వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం.. భక్తులతో కిటకిటలాడిన భద్రాచలం
వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం.. భక్తులతో కిటకిటలాడిన భద్రాచలం

Sri Rama Navami : వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం.. భక్తులతో కిటకిటలాడిన భద్రాచలం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 27, 2026
01:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఈ వేడుకలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, అశేష భక్తజనం పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దేవస్థాన అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

వివరాలు

ఆధునిక సదుపాయాలతో ఘాట్ల నిర్మాణానికి భూమి పూజ

సుమారు రూ.351 కోట్ల అంచనా వ్యయంతో భద్రాద్రి దేవస్థానం సమగ్ర పునర్ అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే గోదావరి నది తీరంలో ఆధునిక సదుపాయాలతో ఘాట్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా యాత్రికులకు మెరుగైన వసతులు, భద్రతా ఏర్పాట్లు కల్పించడం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అభివృద్ధి పనులు పూర్తయ్యాక భద్రాద్రి క్షేత్రం మరింత వైభవంగా రూపుదిద్దుకుంటుందని అధికారులు తెలిపారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

Advertisement