Page Loader
Tamil Nadu: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
Tamil Nadu: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Tamil Nadu: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

వ్రాసిన వారు Stalin
Jan 28, 2024
03:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు రాష్ట్రంలోని తెన్‌కాసిలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సరుకులతో వెళ్తున్న ట్రక్కు, కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు దుర్మరణం చెందారు. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. తెన్‌కాసి జిల్లా పులియంగుడి సమీపంలో సిమెంట్ బస్తాలతో వెళ్తున్న లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంపై చొక్కంపట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తెన్కాసి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ టి.పి. సురేష్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రమాదం జరిగిన స్థలంలోని దృశ్యాలు