LOADING...
SCR: సంక్రాంతి రద్దీ దృష్ట్యా మరో 11 ప్రత్యేక రైళ్లు .. జనవరి 7 నుంచి 12 వరకు నడవనున్న సర్వీసులు 
జనవరి 7 నుంచి 12 వరకు నడవనున్న సర్వీసులు

SCR: సంక్రాంతి రద్దీ దృష్ట్యా మరో 11 ప్రత్యేక రైళ్లు .. జనవరి 7 నుంచి 12 వరకు నడవనున్న సర్వీసులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 31, 2025
12:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

సంక్రాంతి పండుగ సమయం సందర్భంగా సొంతూళ్లను వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచి, ప్రయాణికుల సౌకర్యార్థం అదనంగా 11 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు చెప్పారు. ఈ రైళ్లు జనవరి 7 నుండి 12 వరకు కాకినాడ, వికారాబాద్‌,పార్వతీపురం, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ల మధ్య రాకపోకలు నిర్వహిస్తాయి. ప్రధానంగా కాకినాడ టౌన్ - వికారాబాద్‌ (07186, 07460),వికారాబాద్‌-కాకినాడ టౌన్‌ (07185, 07187) మార్గాల్లో రైళ్లు చలామణీ అవుతాయి. అలాగే, వికారాబాద్‌ - పార్వతీపురం (07461), పార్వతీపురం - వికారాబాద్‌ (07462), పార్వతీపురం - కాకినాడ టౌన్‌ (07463), సికింద్రాబాద్‌ - పార్వతీపురం (07464, 07465) మార్గాల్లో కూడా సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

వివరాలు 

ఇప్పటికే ప్రారంభమైన టికెట్ బుకింగ్‌లు 

ఈ రైళ్లలో AC, స్లీపర్,జనరల్ కోచ్‌లు ఉంటాయని, ఇప్పటికే రిజర్వేషన్లు ప్రారంభమైందని రైల్వే శాఖ పేర్కొంది. విజయవాడ ద్వారా కూడా కొన్ని ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. విశాఖపట్నం - చర్లపల్లి (08511)ప్రత్యేక రైలు జనవరి 10,12,17,19 తేదీల్లో సాయంత్రం 5.30గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి,మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు చర్లపల్లి చేరుతుంది. తిరుగు ప్రయాణం జనవరి 11, 13, 18, 20 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఇంకా,అనకాపల్లి - వికారాబాద్‌ (07416)ప్రత్యేక రైలు జనవరి 18న రాత్రి 9.45కి బయలుదేరనుంది. పండుగ సందర్భంగా ప్రయాణికుల నుండి ఎక్కువ డిమాండ్ ఉన్నందున ఈ ప్రత్యేక రైళ్లు నడపడం నిర్ణయించామని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను ఉపయోగించుకోవాలని సూచించారు.

Advertisement