Page Loader
Narendra Modi: కువైట్‌ పర్యటనలో ప్రధాని మోదీకి ప్రత్యేక గౌరవం
కువైట్‌ పర్యటనలో ప్రధాని మోదీకి ప్రత్యేక గౌరవం

Narendra Modi: కువైట్‌ పర్యటనలో ప్రధాని మోదీకి ప్రత్యేక గౌరవం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 22, 2024
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కువైట్‌ ప్రభుత్వం అత్యున్నత గౌరవ పురస్కారం 'ది ఆర్డర్‌ ఆఫ్‌ ముబారక్‌ అల్‌ కబీర్‌'ను అందించింది. ఈ అవార్డును కువైట్‌ ఎమిర్‌ షేక్ మిశాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా ప్రధాని మోదీకి ప్రదానం చేశారు. స్నేహానికి చిహ్నంగా కువైట్‌ తమ దేశాధినేతలు, విశిష్ట వ్యక్తులకు ఈ పురస్కారం అందజేస్తుంది. గతంలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్‌ క్లింటన్‌, జార్జ్‌ బుష్‌ వంటి ప్రఖ్యాత నాయకులు ఈ అవార్డును అందుకున్నారు. ఇది ప్రధాని మోదీకి లభించిన 20వ అంతర్జాతీయ గౌరవం కావడం విశేషం. కువైట్‌ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి మోదీ ఆదివారం ఆ దేశ ఎమిర్‌తో సమావేశమయ్యారు.

Details

ట్విట్టర్ వేదికగా తెలిపిన మోదీ

ఇరుదేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఫార్మా, ఐటీ, ఫిన్‌టెక్‌, సెక్యూరిటీ వంటి ముఖ్య రంగాల్లో సహకారం పెంపుదలపై చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి మోదీ ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. ఈ భాగస్వామ్యాన్ని వ్యూహాత్మక స్థాయికి తీసుకువెళ్లామని పేర్కొన్నారు. అనంతరం కువైట్‌ క్రౌన్ ప్రిన్స్ షేక్‌ సబా అల్-ఖాలీద్ అల్-సబాతో సమావేశమైన ప్రధాని మోదీ రక్షణ, వాణిజ్య రంగాలపై కీలక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పర్యటనలో భాగంగా బయాన్‌ ప్యాలెస్‌లో గౌరవ వందనం స్వీకరించారు. ఇరుదేశాల మధ్య ఈ స్నేహ సంబంధాలు కొత్త ఒరవడికి దారితీస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.