తదుపరి వార్తా కథనం

AP Govt: ఏపీ-బిల్‌గేట్స్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం.. అమలుకు రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 27, 2025
04:01 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ ప్రభుత్వం బిల్‌గేట్స్ ఫౌండేషన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం అమలుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
సుపరిపాలన, వ్యవసాయంలో ఏఐ సాంకేతికత వినియోగం, వైద్యారోగ్య సేవల మెరుగుదల, జీవన ప్రమాణాల పెంపుదల వంటి అంశాలపై ఏపీ ప్రభుత్వం ఇటీవల గేట్స్ ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకుంది.
ఈ ఒప్పందాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి 26 మంది అధికారులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
మానవ వనరుల అభివృద్ధి, సాధారణ పరిపాలన శాఖలతో పాటు గ్రామ/వార్డు సచివాలయ శాఖ కార్యదర్శులు కూడా ఈ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యులుగా ఉంటారు.
ఒప్పందంలో పేర్కొన్న అంశాల అమలును పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ టాస్క్‌ఫోర్స్‌కు స్పష్టమైన బాధ్యతలు అప్పగించింది.