LOADING...
Special Train: చర్లపల్లి నుంచి నడిచే ఈ ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు.. పూర్తి వివరాలు ఇవే
చర్లపల్లి నుంచి నడిచే ఈ ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు.. పూర్తి వివరాలు ఇవే

Special Train: చర్లపల్లి నుంచి నడిచే ఈ ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు.. పూర్తి వివరాలు ఇవే

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2026
01:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి నుంచి నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను మరోసారి పొడిగించింది. ఈ నిర్ణయంతో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం కలగనుంది.పొడిగించిన రైళ్ల తేదీలు,సర్వీసుల వివరాలను అధికారులు వెల్లడించారు. చర్లపల్లి-షాలిమార్ ప్రత్యేక రైళ్లు ట్రైన్ నెం. 08045 (షాలిమార్-చర్లపల్లి): ఈ ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం నడుస్తుంది. జూలై 3, 10, 17, 24, 31 తేదీల్లో మొత్తం ఐదు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ట్రైన్ నెం. 08046 (చర్లపల్లి-షాలిమార్): ఈ ప్రత్యేక రైలు ప్రతి శనివారం నడవనుంది.జూలై 4, 11, 18, 25తో పాటు ఆగస్టు 1న కూడా మొత్తం ఐదు సర్వీసులు నిర్వహించనున్నారు.

వివరాలు 

చర్లపల్లి-పాట్నా ప్రత్యేక రైళ్లు

ట్రైన్ నెం. 03253 (పాట్నా-చర్లపల్లి): ఈ ప్రత్యేక రైలు సోమవారం, బుధవారం రోజుల్లో నడుస్తుంది. జూలై 20 నుంచి జూలై 29 వరకు మొత్తం నాలుగు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ట్రైన్ నెం. 03254 (చర్లపల్లి-పాట్నా): ఈ ప్రత్యేక రైలు బుధవారం రోజుల్లో నడవనుంది. జూలై 22 నుంచి జూలై 29 వరకు సర్వీసులు కొనసాగుతాయి. ట్రైన్ నెం. 03255 (చర్లపల్లి-పాట్నా): ఈ ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం నడుస్తుంది. జూలై 24 నుంచి జూలై 31 వరకు మొత్తం రెండు సర్వీసులు నిర్వహించనున్నారు.

వివరాలు 

నల్గొండ రైల్వే స్టేషన్‌కు ఆధునిక హంగులు

దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్(ABSS) కింద పునరాభివృద్ధి పనులను వేగవంతం చేసింది. ఈ పథకం కింద తెలంగాణలో రూ.2,000కోట్లకు పైగా అంచనా వ్యయంతో 40రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్‌కు చెందిన నల్గొండ రైల్వే స్టేషన్‌ను రూ.17.01 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేస్తున్నారు. ఈ స్టేషన్ ద్వారా ప్రతిరోజూ సుమారు 3,000 మంది ప్రయాణికులు సేవలు పొందుతున్నారు. రోజుకు దాదాపు 44 రైళ్ల రాకపోకలు జరుగుతున్నాయి. ఉపాధి, విద్య, వ్యాపార అవసరాల కోసం హైదరాబాద్‌తో పాటు ముఖ్యంగా సికింద్రాబాద్,కాచిగూడ, లింగంపల్లి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ స్టేషన్ కీలక కేంద్రంగా నిలుస్తోంది.

Advertisement

వివరాలు 

పునరాభివృద్ధి పనుల్లో ఇవి..

తెలంగాణ దక్షిణ ప్రాంతంలో ఉన్న నల్గొండ రైల్వే స్టేషన్‌ను నాన్ సబర్బన్ గ్రేడ్-4 స్టేషన్‌గా వర్గీకరించారు. ఇది దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని నాడికుడి-బీబీనగర్ రైల్వే సెక్షన్‌లో ఉంది. హైదరాబాద్‌తో పాటు సమీప ప్రాంతాలకు ప్రయాణ సౌకర్యం కల్పించడంలో ఈ స్టేషన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనుల్లో 12 మీటర్ల వెడల్పుతో కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం,3,309 చదరపు మీటర్ల ప్లాట్‌ఫారాలపై అదనపు షెల్టర్ ఏర్పాటు, ల్యాండ్‌స్కేపింగ్‌తో సర్క్యులేటింగ్ ఏరియా అభివృద్ధి, 9,657 చదరపు మీటర్ల ప్లాట్‌ఫాం సర్ఫేసింగ్, కాన్‌కోర్స్ నిర్మాణం, వీఐపీ లాంజ్, వెయిటింగ్ హాల్స్, టాయిలెట్ల అంతర్గత పునరుద్ధరణ వంటి పలు ఆధునిక సౌకర్యాలను కల్పించనున్నారు.

Advertisement