Vande Mataram Bill: 'వందేమాతరం'కు చట్టబద్ధ రక్షణ.. కీలక బిల్లుకు రాజ్యసభ ఆమోదం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jul 29, 2026
04:06 pm
ఈ వార్తాకథనం ఏంటి
జాతీయ గేయం 'వందేమాతరం'కు చట్టపరమైన రక్షణ కల్పించే కీలక బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ నెల 24న సభలో ప్రవేశపెట్టారు. వందేమాతరాన్ని అవమానించడం లేదా అది ఆలపిస్తున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించడం నేరంగా పరిగణించేలా ఈ చట్టంలో నిబంధనలు తీసుకురానున్నారు. వందేమాతరం బిల్లులో భాగంగా 'ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ చట్టం-1971'లో సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుతం జాతీయ గీతం 'జనగణమన'కు ఉన్న చట్టపరమైన రక్షణను జాతీయ గేయమైన 'వందేమాతరం'కూ వర్తింపజేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని కేంద్రం స్పష్టం చేసింది.