Loading...
Supreme Court: దీపావళికి గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు అనుమతి.. కీలక ఆంక్షలు
దీపావళికి గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు అనుమతి.. కీలక ఆంక్షలు

Supreme Court: దీపావళికి గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు అనుమతి.. కీలక ఆంక్షలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 02, 2026
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో దీపావళి సందర్భంగా గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే నవంబర్ 7,8 తేదీల్లో మాత్రమే ధ్రువీకరించిన గ్రీన్ క్రాకర్స్ వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. దీపావళి ముగిసిన తర్వాత నవంబర్ 9 నుంచి మళ్లీ టపాసులపై పూర్తిస్థాయి నిషేధం అమల్లోకి వస్తుందని పేర్కొంది. దీపావళి రోజు ఉదయం 6 నుంచి 7గంటల వరకు, రాత్రి 8 నుంచి 10గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, విద్యాసంస్థలు వంటి ప్రాంతాలకు 300 మీటర్ల పరిధిలో ఎలాంటి క్రాకర్స్ కాల్చకూడదని స్పష్టం చేసింది. ఈ ప్రాంతాలను నో-క్రాకర్ జోన్లుగా ప్రకటించాలని అధికారులను ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన తయారీదారులు,వ్యాపారులు సమర్పించిన సెక్యూరిటీ డిపాజిట్‌ను జప్తు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

వివరాలు 

గ్రీన్ క్రాకర్స్ ప్రత్యేకత ఏమిటి?

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR)కు చెందిన నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NEERI) అభివృద్ధి చేసిన గ్రీన్ క్రాకర్స్.. సంప్రదాయ టపాసులతో పోలిస్తే సుమారు 30 శాతం తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయని చెబుతున్నారు.

వీటి వల్ల పొగ, దుమ్ము, శబ్దం కూడా తక్కువగా ఉంటాయి. అయితే గ్రీన్ క్రాకర్స్‌ను పూర్తిగా కాలుష్యరహితమైనవిగా భావించకూడదు.

వీటిని కాల్చినప్పుడు కూడా కొంతమేర కాలుష్య కారకాలు గాలిలోకి విడుదలవుతాయి. అందువల్ల వీటి వినియోగంలోనూ జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ADVERTISEMENT