Supreme Court: క్రైస్తవంలోకి మారినవారు ఎస్సీ హక్కులు పొందలేరు: సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
ఎస్సీల మతమార్పిడి తర్వాత హక్కుల అంశంపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తులు ఎస్సీ హక్కులకు అర్హులు కాదని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఎస్సీ వర్గానికి సంబంధించిన హక్కులు హిందూ, బౌద్ధ, సిక్కు మతాలను అనుసరించే వారికి మాత్రమే వర్తిస్తాయని వెల్లడించింది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఏపీకి చెందిన ఆనంద్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. అన్ని వాదనలు పరిశీలించిన అనంతరం తుది ఉత్తర్వులు వెలువరించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
క్రైస్తవంలోకి మారిన వారికి ఎస్సీ హక్కులు లేవు: సుప్రీంకోర్టు
#BREAKING| Conversion To Religion Other Than Hinduism, Buddhism Or Sikhism Results In Loss Of Scheduled Caste Status : Supreme Court |@1Simranbakshi
— Live Law (@LiveLawIndia) March 24, 2026
A converted Christian cannot claim SC status, SC held.#SupremeCourt #SupremeCourtofIndia https://t.co/EiKMqFz2l3