Electoral Bonds: ఎస్‌బీఐ ఎలక్టోరల్ బాండ్ల పిటిషన్ రద్దు.. రేపటిలోగా వివరాలు సమర్పించాలన్న సుప్రీంకోర్టు
ఎలక్టోరల్ బాండ్ డోనర్ వివరాలను రేపు, మార్చి 12వ తేదీలోగా భారత ఎన్నికల కమిషన్ (EC)కి సమర్పించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను వెంటనే పాటించాలని స్పష్టంగా చెప్పింది. దీనితో పాటు, ఎన్నికల సంఘం ఈ సమాచారాన్ని మార్చి 15 సాయంత్రం 5 గంటలలోపు పోర్టల్‌లో పబ్లిక్ చేయాలని తెలిపింది. ఎన్నికల బాండ్ల వ్యవహారంలో ఎస్‌బీఐపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత 26 రోజులుగా ఏం చేశారంటూ ఆగ్రహించింది. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడి చేయడానికి గడువును జూన్ 30 వరకూ పొడిగించాలంటూ ఎస్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపింది.