LOADING...
CM MK Stalin: గవర్నర్లకు గడువు తప్పనిసరి:.. రాజ్యాంగ స‌వ‌ర‌ణ కోరిన తమిళనాడు సీఎం స్టాలిన్
గవర్నర్లకు గడువు తప్పనిసరి:.. రాజ్యాంగ స‌వ‌ర‌ణ కోరిన తమిళనాడు సీఎం స్టాలిన్

CM MK Stalin: గవర్నర్లకు గడువు తప్పనిసరి:.. రాజ్యాంగ స‌వ‌ర‌ణ కోరిన తమిళనాడు సీఎం స్టాలిన్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 21, 2025
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిల్లుల క్లియరెన్స్‌పై రాష్ట్రపతి, గవర్నర్లకు సమయపరిమితి విధించలేమని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ స్పందించారు. బిల్లులు ఆమోద దశకు చేరాలంటే గవర్నర్లకు తప్పనిసరిగా గడువు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ, గవర్నర్లకు నిర్ణయ గడువు విధించే వరకు తాను వెనక్కి తగ్గబోనని స్టాలిన్ పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అడిగిన ప్రశ్నలపై సుప్రీంకోర్టు ఇచ్చిన అభిప్రాయాలను ప్రస్తావిస్తూ, రాష్ట్ర హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. నిజమైన ఫెడరల్ వ్యవస్థ, రాష్ట్రాలకు లభించాల్సిన అధికారం కోసం తమ ప్రయత్నం ఆగదని చెప్పారు.

వివరాలు 

రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు గడువులు నిర్దేశించడం అసాధ్యం 

అలాగే, తమిళనాడు రాష్ట్రం.. గవర్నర్ మధ్య సాగిన కేసులో ఏప్రిల్ 8న ఇచ్చిన తీర్పుపై ఈ తాజా సూచనలు ప్రభావం చూపవని అన్నారు. ఇదిలా ఉండగా, పెండింగ్‌లో ఉన్న బిల్లుల విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు గడువులు నిర్దేశించడం అసాధ్యమని సుప్రీంకోర్టు గురువారం మరోసారి తెలియజేసింది. నిర్ణీత సమయం లోపల గవర్నర్ స్పందించకపోతే, బిల్లు ఆటోమేటిక్‌గా ఆమోదించబడినట్లు పరిగణించాలనే భావన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కోర్టు పేర్కొంది. అలాంటి సంప్రదాయం ఏర్పరిచే ఉద్దేశ్యం తమకే లేదని స్పష్టం చేసింది. అయితే, ఏ కారణం లేకుండా బిల్లులను అధికకాలం పెండింగ్‌లో ఉంచిన సందర్భంలో కోర్టులు పరిమిత పరిధిలో జోక్యం చేసుకోవచ్చని వివరించింది.

వివరాలు 

ద్రౌపదీ ముర్ము సంధించిన 14 ప్రశ్నలకు సమాధానాలు 

రాష్ట్రపతి ముర్ము పంపిన 14 ప్రశ్నలకు (ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్) సంబంధించిన సమగ్ర సమాధానాన్ని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ ఏఎస్ చందూర్కర్‌లతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎం.కె. స్టాలిన్ చేసిన ట్వీట్