Loading...
TDP and Jana Sena: స్థానిక ఎన్నికల్లో టీడీపీ,జనసేన కలిసి పోటీ.. సీట్ల సర్దుబాటు పూర్తి
స్థానిక ఎన్నికల్లో టీడీపీ,జనసేన కలిసి పోటీ.. సీట్ల సర్దుబాటు పూర్తి

TDP and Jana Sena: స్థానిక ఎన్నికల్లో టీడీపీ,జనసేన కలిసి పోటీ.. సీట్ల సర్దుబాటు పూర్తి

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 15, 2026
08:21 am

ఈ వార్తాకథనం ఏంటి

త్వరలో ఆంధ్రప్రదేశ్'లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీ కలిసి పోటీ చేయనున్నాయి. ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు విజయవంతంగా ముగిశాయని జనసేన నేతలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ యాదవ్, చిల్లపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. బుధవారం రాత్రి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జనసేన విప్ పి. హరిప్రసాద్, మరో నేత పెండెం దొరబాబుతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన ఐక్యతతోనే స్థానిక ఎన్నికల్లోనూ బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో సీట్ల కేటాయింపునకు గెలుపు అవకాశాలనే ప్రధాన ప్రాతిపదికగా తీసుకున్నట్లు జనసేన నేతలు తెలిపారు.

వివరాలు 

2029 ఎన్నికల్లోనూ టీడీపీ, జనసేన మధ్య పొత్తు

ఎన్ని సీట్లు దక్కాయన్నది తమకు ముఖ్యం కాదని, ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

ఏ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందనే వివరాలతో పాటు ఉమ్మడి అభ్యర్థుల జాబితాను మరో రెండు రోజుల్లో విడుదల చేస్తామని వెల్లడించారు.

సీట్ల సర్దుబాటు కారణంగా టీడీపీ, జనసేన కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కూటమిపై నమ్మకంతో ఓట్లు వేశారని, ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తామని నేతలు పేర్కొన్నారు.

కూటమిలో విభేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారానికి తావు లేకుండా ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్లు వివరించారు.

టీడీపీ, జనసేన మధ్య పొత్తు 2029 ఎన్నికల్లోనూ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

వివరాలు 

2029 ఎన్నికల్లోనూ టీడీపీ, జనసేన మధ్య పొత్తు

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగానే సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయిందని నేతలు తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి ఐక్యతను కొనసాగిస్తూ, గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని వెల్లడించారు.

ADVERTISEMENT