Loading...
Ongole Mayor: ఒంగోలు కార్పొరేషన్‌లో టీడీపీ ప్రభంజనం.. మేయర్‌గా నల్లమల్లి శ్రీశిల్ప
ఒంగోలు కార్పొరేషన్‌లో టీడీపీ ప్రభంజనం.. మేయర్‌గా నల్లమల్లి శ్రీశిల్ప

Ongole Mayor: ఒంగోలు కార్పొరేషన్‌లో టీడీపీ ప్రభంజనం.. మేయర్‌గా నల్లమల్లి శ్రీశిల్ప

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2026
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. మేయర్ పీఠాన్ని టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌పై 37,172 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. బుధవారం మధ్యాహ్నం వెలువడిన ఫలితాలతో ఒంగోలు కార్పొరేషన్‌పై టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పట్టు సాధించింది. ఈ ఎన్నికల్లో కూటమి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మొత్తం డివిజన్లలో టీడీపీ 39 స్థానాలను కైవసం చేసుకోగా, జనసేన 8, బీజేపీ ఒక డివిజన్‌లో విజయం సాధించాయి. మరోవైపు వైసీపీ 11 డివిజన్లకే పరిమితమైంది. ఇతరులు మూడు డివిజన్లలో గెలుపొందారు. దీంతో కార్పొరేషన్ కౌన్సిల్‌లో టీడీపీ కూటమికి స్పష్టమైన మెజారిటీ లభించింది.

వివరాలు 

ఒంగోలు నగరంలో టీడీపీ శ్రేణులు సంబరాలు

'మురసు' తుపాను ప్రభావంతో ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది.

తుపాను కారణంగా వాయిదా పడిన కౌంటింగ్‌ను అధికారులు బుధవారం పూర్తి చేశారు.

అనంతరం మధ్యాహ్నం తుది ఫలితాలను అధికారికంగా ప్రకటించారు.

ఈ విజయంతో ఒంగోలు నగరంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

ADVERTISEMENT