Page Loader
Tej Pratap Yadav: లాలుకు షాక్‌ ఇచ్చిన తేజ్ ప్రతాప్‌.. కొత్త పార్టీ దిశగా అడుగులేస్తున్న కొడుకు! 
లాలుకు షాక్‌ ఇచ్చిన తేజ్ ప్రతాప్‌.. కొత్త పార్టీ దిశగా అడుగులేస్తున్న కొడుకు!

Tej Pratap Yadav: లాలుకు షాక్‌ ఇచ్చిన తేజ్ ప్రతాప్‌.. కొత్త పార్టీ దిశగా అడుగులేస్తున్న కొడుకు! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 11, 2025
12:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌ రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. ఆర్జేడీ (RJD) నుంచి బహిష్కరణకు గురైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ ఇప్పుడు తనదైన దారిలో ముందుకెళ్తున్నారు. తండ్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీసుకున్న నిర్ణయానికి తేజ్ ప్రతాప్ కౌంటర్‌గా కొత్త పార్టీ బ్యానర్‌పై మహువాలో భారీ ర్యాలీ నిర్వహించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగేందుకు సంకేతాలిచ్చారు.

Details

'టీమ్ తేజ్ ప్రతాప్'తో మహువాలో ప్యూర్ షో

తాజాగా మహువా నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలో తేజ్ ప్రతాప్‌కు ఊహించని స్థాయిలో మద్దతు లభించింది. మద్దతుదారులు ఆకుపచ్చ, తెలుపు రంగుల్లోని జెండాలను పట్టుకుని ర్యాలీకి హాజరయ్యారు. ఆ జెండాలపై 'టీమ్ తేజ్ ప్రతాప్' అనే పదాలు స్పష్టంగా కనిపించాయి. తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మహువాలోనే ర్యాలీ చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో తేజ్ ప్రతాప్ తన ప్రత్యేక గుర్తింపు అయిన ఆకుపచ్చ క్యాప్ కూడా ధరించి ప్రజలలో ఉత్సాహాన్ని పెంచారు.

Details

 ప్రజలే నిర్ణయం తీసుకుంటారు: తేజ్ ప్రతాప్

తాను ఇకపై ఎవరి నియంత్రణలో పనిచేయనని తేజ్ ప్రతాప్ స్పష్టం చేశారు. ప్రజలే నా నాయకులు. వారు చెప్పిన దిశలోనే నేను నడుస్తాను. వారు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పారు. ప్రజానివేదిక మీద తన రాజకీయ భవిష్యత్తును ఆధారపెట్టబోతున్నానని వివరించారు.

Details

తండ్రితో విభేదాలు.. పార్టీలోంచి బహిష్కరణ 

తేజ్ ప్రతాప్‌ను ఆరు సంవత్సరాల పాటు ఆర్జేడీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ మహిళ అనుష్క యాదవ్‌తో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం, అనంతరం వాటిని డిలీట్ చేసి ఫేస్‌బుక్‌ హ్యాక్‌ అయిందని చెప్పడం కలకలం రేపింది. దీనిపై తీవ్రంగా స్పందించిన లాలూ ప్రసాద్ యాదవ్ తేజ్ ప్రతాప్‌తో అన్ని సంబంధాలు తెంచుకుంటున్నట్లు ప్రకటించారు.

Details

రాజకీయంగా కొత్త అడుగు 

2015లో రాజకీయాల్లోకి వచ్చిన తేజ్ ప్రతాప్, ఇప్పుడు పూర్తిగా స్వతంత్రంగా రాజకీయాల్లో నడవబోతున్నట్లు స్పష్టంగా సంకేతాలు ఇస్తున్నారు. తనకో ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోవాలన్న లక్ష్యంతో నడుస్తున్న ఆయన రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత మేర దూసుకెళ్తారో చూడాలి.