Telangana: తెలంగాణ రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్.. కీలక ప్రకటనలు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌ను మొత్తం రూ.3,24,234 కోట్లుగా ప్రకటించారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలు, మార్గదర్శకత్వాన్ని అనుసరించుతూ పాలన కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు శాసనమండలిలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
వివరాలు
బడ్జెట్ స్వరూపం
మొత్తం బడ్జెట్: రూ.3,24,234 కోట్లు రెవెన్యూ వ్యయం: రూ.2,34,406 కోట్లు మూలధన వ్యయం: రూ.47,267 కోట్లు
వివరాలు
బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
బడ్జెట్ ప్రసంగంలో పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. ముఖ్యంగా విద్యార్థులు, రైతులు, పౌరసరఫరాలు వంటి రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించారు ఐటీఐ, ఏటీసీల్లో చదువుతున్న విద్యార్థులకు నెలకు రూ.2,000 ఉపకార వేతనం అందించనున్నారు వ్యవసాయ శాఖకు రూ.23,179 కోట్లు విద్యుత్ శాఖకు రూ.21,285 కోట్లు పౌరసరఫరాల శాఖకు రూ.7,366 కోట్లు పశుసంవర్ధక శాఖకు రూ.1,529 కోట్లు విద్యా శాఖకు రూ.26,674 కోట్లు వైద్య శాఖకు రూ.13,679 కోట్లు కార్మిక శాఖకు రూ.998 కోట్లు మహిళ, శిశు సంక్షేమ శాఖకు రూ.3,143 కోట్లు పర్యాటక రంగానికి రూ.1,224 కోట్లు ఎస్సీ సంక్షేమం.. రూ.11,784 కోట్లు ఎస్టీ సంక్షేమం.. రూ.7,934 కోట్లు
వివరాలు
బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
బీసీ సంక్షేమం.. రూ.12,511 కోట్లు మైనార్టీ సంక్షేమం.. రూ.3,769 కోట్లు కల్యాణ లక్ష్మీ పథకం.. రూ.3,683 కోట్లు ఉపకార వేతనాలకు రూ.4,343 కోట్లు యంగ్ ఇండియా స్కూళ్లకు రూ.5 వేల కోట్లు మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్.. రూ.1500 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి రూ.వెయ్యి కోట్లు మెట్రో రైలు ఫేజ్-2.. రూ.600 కోట్లు మహాలక్ష్మీ గ్యాస్ సబ్సిడీ పథకం.. రూ.723 కోట్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ.. రూ.1143 కోట్లు గృహజ్యోతి పథకానికి రూ.2,080 కోట్లు వ్యవసాయ ఉత్పత్తులకు బోనస్.. రూ.3500 కోట్లు మహాలక్ష్మీ పథకం.. రూ.4,305 కోట్లు ఇందిరమ్మ ఇళ్లు.. రూ.5,500 కోట్లు చేయూత పథకం.. రూ.14,861 కోట్లు రైతు భరోసా.. రూ.18 వేల కోట్లు ఆరు గ్యారంటీల అమలుకు.. రూ.50,713 కోట్లు