Loading...
Telangana: తెలంగాణలో 41 కొత్త బార్లకు గ్రీన్‌ సిగ్నల్‌.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణలో 41 కొత్త బార్లకు గ్రీన్‌ సిగ్నల్‌.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

Telangana: తెలంగాణలో 41 కొత్త బార్లకు గ్రీన్‌ సిగ్నల్‌.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 28, 2026
08:42 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో కొత్తగా 41 బార్‌ అండ్‌ రెస్టారెంట్ల (2బీ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ ఆదివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలో తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (టీసీయూఆర్‌) పరిధిలో 14 బార్లు, రాష్ట్రంలోని ఇతర మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో మరో 27 బార్లకు లైసెన్సులు జారీ చేయనున్నారు.

వివరాలు 

దరఖాస్తుకు రూ.లక్ష నాన్‌ రిఫండబుల్‌ ఫీజు

కొత్త బార్‌ లైసెన్సుల కోసం ఆసక్తి ఉన్నవారు ఒక్కో దరఖాస్తుకు రూ.లక్ష నాన్‌ రిఫండబుల్‌ ఫీజుగా చెల్లించాలి.

సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 12 వరకు ప్రభుత్వ పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.

అక్టోబర్‌ 16న ఉదయం 11 గంటలకు లాటరీ విధానంలో లైసెన్సుదారులను ఎంపిక చేస్తారు.

లాటరీలో ఎంపికైన తర్వాత లైసెన్స్‌ తీసుకోకపోయినా, నిబంధనలను ఉల్లంఘించినా రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.

వివరాలు 

ప్రాంతాల వారీగా బార్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్

బార్లకు చెల్లించాల్సిన వార్షిక బార్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ (బీఈటీ)ను ప్రాంతాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (టీసీయూఆర్‌) పరిధిలోని బార్లకు ఏడాదికి రూ.44 లక్షలుగా రుసుము ఖరారు చేశారు.

బోధన్‌ వంటి కొన్ని ప్రాంతాల్లో రూ.42 లక్షలు, మిగిలిన మున్సిపాలిటీల పరిధిలో రూ.30 లక్షలుగా నిర్ణయించారు.

కొత్తగా ఏర్పాటు చేయనున్న 41 బార్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏటా సుమారు రూ.14.62 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

తొలిసారిగా కొన్ని ప్రాంతాల్లో బార్లు

ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేవరకద్ర, ఎల్లంపల్లి, మద్దూరు, గుమ్మడిదల వంటి ప్రాంతాల్లో తొలిసారిగా బార్లు ఏర్పాటు కానున్నాయి.

వీటితో పాటు చేవెళ్ల, మొయినాబాద్‌, కొడంగల్‌, పరిగి, అశ్వరావుపేట, కల్లూరు, మక్తల్‌, నర్సంపేట, స్టేషన్‌ ఘన్‌పూర్‌, ములుగు తదితర మున్సిపాలిటీల్లోనూ కొత్త బార్‌ లైసెన్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానించారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,185 బార్లు కొనసాగుతున్నాయి. ఇందులో ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే 657 బార్లు ఉన్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ADVERTISEMENT