Chinna Reddy: చిన్నారెడ్డిపై వేటు.. ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగింపు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యవహారానికి కీలక మలుపు వచ్చింది. చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో గద్వాల విజయలక్ష్మిని వైస్ చైర్‌పర్సన్‌గా నియమించింది. ఇదే సమయంలో కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ సీఎంవో తెలంగాణ గవర్నర్‌కు సిఫారసు లేఖ పంపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ వరుస నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీలో, తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే విషయంలో ఎవరినీ ఉపేక్షించబోమనే సంకేతాన్ని అగ్రనాయకత్వం ఇచ్చినట్లుగా రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
చిన్నారెడ్డి ఏమన్నారు?
ఆగస్టు 16న వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయ ప్రారంభ కార్యక్రమానికి చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సొంత పార్టీకి చెందిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
మేఘారెడ్డి డబ్బులు చెల్లించి ఎమ్మెల్యే టికెట్ పొందారని చిన్నారెడ్డి ఆరోపించారు.
వనపర్తి అసెంబ్లీ టికెట్‌ను మేఘారెడ్డికి ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ.. అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సూచించారని ఆయన పేర్కొన్నారు.
మేఘారెడ్డి వద్ద డబ్బులు లేకుంటే పార్టీ తరఫున ఖర్చు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు.
అయితే, కాంగ్రెస్‌లోని ఎన్నికల కమిటీ డబ్బులకు ఆశపడి తనకు టికెట్ ఇవ్వలేదని చిన్నారెడ్డి ఆరోపించారు.
వివరాలు
చిన్నారెడ్డి ఏమన్నారు?
మేఘారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని అవినీతి పార్టీగా మార్చారని విమర్శించారు.
తన అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
అంతేకాకుండా తన అనుచరులు, కార్యకర్తలను మేఘారెడ్డి ఇబ్బందులకు గురిచేస్తున్నారని చిన్నారెడ్డి అన్నారు.
తన సహనం నశిస్తే మరో జీవన్‌రెడ్డిలా మారి తిరగబడాల్సి వస్తుందని హెచ్చరించారు.
వివరాలు
మేఘారెడ్డి తీవ్ర ఆగ్రహం
చిన్నారెడ్డి చేసిన ఆరోపణలపై వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తీవ్రంగా స్పందించారు.
తాను డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ సంపాదించుకున్నానన్న ఆరోపణలను ఆయన పూర్తిగా ఖండించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం సర్వే నిర్వహించిందని మేఘారెడ్డి తెలిపారు.
గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థులకే పార్టీ టికెట్లు కేటాయించిందని చెప్పారు.
తాను ఎమ్మెల్యే టికెట్ కోసం డబ్బులు ఇచ్చినట్లు ఆరోపిస్తున్న చిన్నారెడ్డి.. ఆ నగదును ఎవరికి ఇచ్చానో కూడా వెల్లడించాలని మేఘారెడ్డి సవాల్ చేశారు.
వివరాలు
మేఘారెడ్డి తీవ్ర ఆగ్రహం
2014, 2018 ఎన్నికల సమయంలో ఇకపై తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని చిన్నారెడ్డి స్వయంగా చెప్పారని మేఘారెడ్డి గుర్తుచేశారు.
పార్టీ అధిష్ఠానం ఎవరికి టికెట్ ఇచ్చినా వారి విజయానికి కృషి చేస్తానని అప్పట్లో చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.
చిన్నారెడ్డి చేస్తున్న అనవసర వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠతో పాటు తన వ్యక్తిగత ప్రతిష్ఠను కూడా దెబ్బతీస్తున్నాయని మేఘారెడ్డి మండిపడ్డారు.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానంలోని పెద్దలకు ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.