Telangana Elections : తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. MCC ఉల్లంఘిస్తే కఠిన చర్యలే
తెలంగాణలో ఎన్నికల ప్రచార వేడి ముగిసింది. మంగళవారం ఐదు గంటలకు నేతలు ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. ఈ మేరకు ఇంటికే పరిమితమయ్యారు. గత నెల పదిహేను రోజుల నుంచి రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వాడివేడిగా సాగింది. విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో ప్రచారం హీటెక్కిపోయింది. సభలు, సమావేశాలు, ర్యాలీలతో తెలంగాణ హోరెత్తిపోయింది. ఈ సందర్బంగా ఇంటింటికి తిరిగి తమకే ఓట్లేయాలని అభ్యర్థించారు. ఇదే సమయంలో ప్రధాన పార్టీల అగ్రనేతలందరూ, జాతీయ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. తమనే ఎన్నుకోవాలని, ఫలితంగా ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో చెప్పుకొచ్చారు. అవతల పార్టీలకు ఓట్లు వేస్తే జరిగే నష్టాలను ప్రజలకు వివరించారు.
బార్లు, వైన్ షాపులు మూడు రోజుల పాటు బంద్
సమయపాలన లేక సభలకు హాజరై నేతలు బీపీ,షుగర్ తెచ్చుకున్నారు.నేటి సాయంత్రం నుంచి తెలంగాణవ్యాప్తంగా 144వ సెక్షన్'ను విధించారు. ఐదుగురికి మించి గుమిగూడితే చర్యలు తప్పవని ఎన్నికల అధికారులు, పోలీసులు హెచ్చరించారు. బార్లు, వైన్ షాపులు మూడు రోజుల పాటు మూతపడనున్నాయి. ఎన్నికలు ముగిసే వరకూ. అంటే నవంబర్ 30న సాయంత్రం 5 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారు స్వస్థలాలకు వెళ్లాల్సి ఉంటుంది. సాయంత్రం 5 నుంచి 30 సాయంత్రం 5 వరకు సైలెంట్ పీరియడ్‌లో టీవీ, సోషల్ మీడియాలో ప్రకటనలకు అనుమతి లేదని ఎన్నికల అధికారులు అన్నారు. పత్రికల్లో వేసే ప్రకటనలకు ఎంసీఎంసీ (మోడల్ కోడ్ మీడియా కమిటీ) ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు.