LOADING...
Telangana: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం: పోలీసు సిబ్బంది, అధికారులకు పతకాలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం: పోలీసు సిబ్బంది, అధికారులకు పతకాలు

Telangana: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం: పోలీసు సిబ్బంది, అధికారులకు పతకాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 02, 2026
08:17 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట సేవలు అందించిన 632 మంది పోలీసు సిబ్బంది, అధికారులకు వివిధ పతకాలను ప్రకటించింది. ఈ మేరకు అర్హులైన వారి పేర్ల జాబితాను సోమవారం విడుదల చేసింది. పోలీస్ శాఖతో పాటు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ), ప్రత్యేక రక్షణ దళం (ఎస్‌పీఎఫ్), అగ్నిమాపక సేవల విభాగాల్లో విధులు నిర్వహిస్తూ విశేష ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఈ పతకాలకు ఎంపిక చేశారు. వారి సేవలు, అంకితభావం, విధి నిర్వహణలో చూపిన నిబద్ధతకు గుర్తింపుగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.

వివరాలు 

16 మందికి మహోన్నత సేవా పతకాలు

తెలంగాణ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ చీఫ్ ప్రతాప్‌కు సీఎం సర్వోన్నత పోలీసు పతకం ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ రవి,చెర్ల సీఐ రాజులకు తెలంగాణ పోలీసు శౌర్య పతకాలు లభించాయి. అలాగే ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ సంపత్‌తో పాటు గ్రేహౌండ్స్ దళంలోని మరో ఏడుగురు సిబ్బందిని కూడా శౌర్య పతకాలకు ఎంపిక చేశారు. ఇక మొత్తం 16 మందికి మహోన్నత సేవా పతకాలు, 94 మందికి ఉత్తమ సేవా పతకాలు, 50 మందికి కఠిన సేవా పతకాలు ప్రకటించారు. అదనంగా 461 మంది సిబ్బందికి సేవా పతకాలు అందజేయనున్నారు. రాష్ట్ర భద్రత, ప్రజాసేవలో విశేష కృషి చేసిన అధికారులకు, సిబ్బందికి ఈ పతకాలు ప్రోత్సాహకంగా నిలుస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

Advertisement