Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. రెండు డీఏలు మంజూరు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం రెండు డీఏలను మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జనవరి, జులై నెలలకు సంబంధించిన డీఏలను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు డీఏలు కలిపి మొత్తం 6.27శాతం పెరుగుదల ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ నెల వేతనంతో కలిపి పెరిగిన డీఏను ఉద్యోగులకు చెల్లించనున్నారు. డీఏకు సంబంధించిన బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) పరిధిలో ఉన్న ఉద్యోగులకు డీఏ బకాయిల చెల్లింపులో ప్రత్యేక విధానం అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా మొదటి డీఏను 33 వాయిదాల్లో, రెండో డీఏను 27 వాయిదాల్లో చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తెలంగాణ ఉద్యోగులకు రెండు డీఏలు విడుదల
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..#Telangana pic.twitter.com/F6zYDtgnks
— Telugu Stride (@TeluguStride) October 7, 2026