Telangana: పౌరుల సమగ్ర డేటాబేస్ రూపొందించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం.. మీ నుంచి ఏ వివరాలు సేకరించనున్నారంటే ?
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పౌరుల సమగ్ర డేటాబేస్‌ను రూపొందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే అధికారులచే డీపీఆర్ (డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధం కాగా,దాని అమలుకు రూ.30 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తోంది.
ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేస్తే,రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు వెచ్చించనుంది.
మొత్తం రెండు సంవత్సరాల్లో ఈ డేటాబేస్‌ను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అర్హులైన వారికే ప్రభుత్వ పథకాలను ఖచ్చితంగా చేరవేయడం,పారదర్శకతను పెంచడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశంగా చెబుతోంది.
తెలంగాణ ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ గతంలో కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్‌కు లేఖ రాసి,ప్రాజెక్టు ప్రాముఖ్యత వివరించారు.
వివరాలు
ఈ డేటాబేస్‌లో ఏముంటాయి?
ఈ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను సమీకరించనున్నారు.
ప్రతి కుటుంబానికి ప్రత్యేక ఐడీ నంబర్ కుటుంబ సభ్యుల వివరాలు & ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమాచారం కుటుంబానికి సంబంధించిన డాక్యుమెంట్లు (పథకాల కోసం అవసరమైనవి) జనన ధ్రువీకరణ పత్రాలు, ఆదాయ ధ్రువీకరణ, ఆధార్ కార్డు వంటి సమాచార డిజిటలైజేషన్,డేటా భద్రత & ప్రైవసీ.
ఈ సమాచారాన్ని అనుమతి ఉన్న వ్యక్తులకే అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక ప్రోటోకాల్ ఏర్పాటు చేయనున్నారు.
ఇప్పటికే ఉన్న డేటాను కొత్త డేటాబేస్‌లోకి మార్చి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. డేటా కోల్పోకుండా రికవరీ ఏర్పాట్లు కూడా ఉంటాయి.
వివరాలు
ప్రయోజనాలు
ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి తప్పక చేరవేయడం లబ్ధిదారుల దరఖాస్తులను వేగంగా పరిష్కరించడం దరఖాస్తుల ప్రస్తుత స్థితిని సులభంగా తెలుసుకునే అవకాశం పథకాల అమలుకు అవసరమైన నిధుల వివరాలను సులభంగా పొందే వీలుపడడం ఈ డేటాబేస్ ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి పరస్పర ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
రెండు సంవత్సరాల్లో పూర్తవనున్న ఈ ప్రాజెక్ట్ మరింత పారదర్శకమైన పాలనకు దారి తీస్తుందని అంచనా!