విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వ కానుక.. జూన్ 20 నుంచి ప్రతిరోజూ రాగిజావా
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం బడి పిల్లలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్కార్ పాఠశాలల్లో విద్యార్థులకు ఉధయం అల్పాహారంగా రాగిజావను అందించనున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో చిరుధాన్యాల్లోని బలమైన రాగిజావను ఆహారంగా అందించాలని నిర్ణయించామన్నారు.
ఈ మేరకు విద్యాశాఖ పనితీరు, విద్యా దినోత్సవం నిర్వహణపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
రోజూ ఉదయం ప్రార్థన సమయానికి ముందు ప్రతి విద్యార్థికి 250 మిల్లీలీటర్ల రాగిజావ అందిస్తామన్నారు.
ఈ ఫథకం వల్ల 28,606 ప్రభుత్వ పాఠశాలలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ మేరకు దాదాపుగా 25,26,907 మంది విద్యార్థులకు రాగిజావ అందుతుందన్నారు.
Details
డిజిటల్ క్లాస్ ల ప్రారంభానికి ఏర్పాట్లు చేయండి : మంత్రి సబితా
మరోవైపు ప్రభుత్వ పాఠశాల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు సుమారు 16,27,457 మంది విద్యార్థులు చదువుకుంటుండగా, ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులు 12,39,415 మంది ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
అయితే ఫస్ట్ క్లాస్ నుంచి 5 తరగతి పిల్లలకు 3 పుస్తకాలు , 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సబ్జెక్టుకు ఒక నోటు పుస్తకం అందిస్తామని మంత్రి చెప్పారు.
1600 పాఠశాలల్లో 4,800 డిజిటల్ తరగతుల ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు.
అలాగే 30 లక్షల మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను, 26 లక్షల మందికి రెండు జతల చొప్పున స్కూల్ యూనిఫామ్‌లను అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.