TGPSC Group 1 Results : తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల.. మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ఫలితాలను ప్రకటించింది.
మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన ప్రొవిజినల్ మార్కులను TSPSC అధికారిక వెబ్‌సైట్ [https://www.tspsc.gov.in/](https://www.tspsc.gov.in/)లో విడుదల చేసింది.
అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను ఉపయోగించి మార్కులను తెలుసుకోవచ్చు.
మొత్తం 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
Details
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వివరాలు
గతేడాది అక్టోబర్‌లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించగా, 67.17% హాజరు నమోదైంది. ఈ పరీక్షలకు మొత్తం 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
అక్టోబర్ 21న ప్రారంభమైన ఈ పరీక్షలు అక్టోబర్ 27న ముగిశాయి. మొత్తం 31,403 మంది ప్రిలిమ్స్ అర్హత పొందగా, హైకోర్టు అనుమతితో 20 మంది స్పోర్ట్స్ కేటగిరీ అభ్యర్థులు కూడా పరీక్షలు రాశారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు.
Details
మెయిన్స్ మార్కులు ఎలా చెక్ చేయాలి?
అభ్యర్థులు తమ మెయిన్స్ పరీక్ష మార్కులను తెలుసుకోవడానికి TSPSC అధికారిక వెబ్‌సైట్ [https://www.tspsc.gov.in/](https://www.tspsc.gov.in/)లో లాగిన్ కావాలి.
హోంపేజీలో 'గ్రూప్-1 మెయిన్స్ మెమొరాండం ఆఫ్ మార్క్స్' లేదా 'మెయిన్స్ రీకౌంటింగ్ మార్క్స్' విభాగంలో మార్కులను చెక్ చేయవచ్చు.
అభ్యర్థి TSPSC ఐడీ, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయడం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.