Loading...
GST Collections: జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ జోరు.. దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానం..
జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ జోరు.. దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానం..

GST Collections: జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ జోరు.. దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానం..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 02, 2026
08:39 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో వస్తు సేవల పన్ను (GST) వసూళ్లు సెప్టెంబరులో రూ.2,03,521 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే నెలలో నమోదైన వసూళ్లతో పోలిస్తే 14.7 శాతం వృద్ధి నమోదైంది. ఈ వివరాలను కేంద్ర ఆర్థికశాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. సెప్టెంబరులో దేశీయ వ్యాపార కార్యకలాపాల ద్వారా రూ.1,37,996 కోట్ల జీఎస్టీ ఆదాయం సమకూరింది. దిగుమతులపై పన్నుల ద్వారా మరో రూ.65,525 కోట్లు ప్రభుత్వానికి వచ్చాయి. ఇదే సమయంలో రిఫండ్‌ల రూపంలో రూ.27,001 కోట్లు చెల్లించారు. రిఫండ్‌లను మినహాయించిన తర్వాత నికర జీఎస్టీ ఆదాయం రూ.1,76,520 కోట్లుగా నమోదైంది. గత ఏడాది సెప్టెంబరుతో పోలిస్తే నికర వసూళ్లలో 18.1 శాతం వృద్ధి కనిపించింది.

వివరాలు 

దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానం

తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు సెప్టెంబరులో రూ.5,327 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 18 శాతం వృద్ధి నమోదైంది.

దీంతో సెప్టెంబరు నెలలో జీఎస్టీ వసూళ్ల వృద్ధి పరంగా దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది.

కర్ణాటక 16 శాతం, కేరళ 11 శాతం, ఆంధ్రప్రదేశ్ 6 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

మరోవైపు తమిళనాడులో 5 శాతం, లక్షద్వీప్‌లో 21 శాతం, పుదుచ్చేరిలో 31 శాతం క్షీణత నమోదైంది.

వివరాలు 

దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానం

ఇక ఎస్‌జీఎస్టీ, ఐజీఎస్టీలో ఎస్‌జీఎస్టీ వాటాను పంచిన తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో తెలంగాణ రూ.26,287 కోట్ల జీఎస్టీ ఆదాయాన్ని సమకూర్చుకుంది.

ఈ కాలంలో రాష్ట్రం 18 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది.

ఇదే కాలంలో పుదుచ్చేరి 24 శాతం, కర్ణాటక 21 శాతం, కేరళ 19 శాతం, ఆంధ్రప్రదేశ్ 18 శాతం, తమిళనాడు 16 శాతం వృద్ధిని సాధించాయి.

ADVERTISEMENT