Loading...
Telangana: తెలంగాణలో రూ.925 కోట్ల ట్రాఫిక్ చలాన్ బకాయిలు.. 'సుప్రీం' ఆదేశాలతో కఠిన కార్యాచరణకు రవాణాశాఖ సిద్ధం
'సుప్రీం' ఆదేశాలతో కఠిన కార్యాచరణకు రవాణాశాఖ సిద్ధం

Telangana: తెలంగాణలో రూ.925 కోట్ల ట్రాఫిక్ చలాన్ బకాయిలు.. 'సుప్రీం' ఆదేశాలతో కఠిన కార్యాచరణకు రవాణాశాఖ సిద్ధం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2026
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో తెలంగాణ రవాణాశాఖ అప్రమత్తమైంది. పదేపదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని అన్ని రాష్ట్రాల రవాణాశాఖలను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘనల వివరాలను అధికారులు సమగ్రంగా పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో రహదారి నిబంధనలు ఉల్లంఘించడం వాహనదారుల్లో సాధారణంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 2024 జనవరి 1 నుంచి 2026 ఆగస్టు 15 వరకు 32నెలల వ్యవధిలోనే ప్రమాదాలకు కారణమయ్యే ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి 3,77,65,997చలాన్లు నమోదయ్యాయి. అంటే నెలకు సగటున సుమారు 12లక్షలు, రోజుకు దాదాపు 39,400, నిమిషానికి సుమారు 27 ఉల్లంఘనలు నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

వివరాలు 

75 శాతం చలాన్లు పెండింగ్‌లోనే..

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి దేశవ్యాప్తంగా వాహనదారులు చెల్లించాల్సిన ఈ-చలాన్ బకాయిలు రూ.20 వేల కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం.

తెలంగాణలో 2024 నుంచి 2026 ఆగస్టు 15 వరకు నమోదైన చలాన్లకు సంబంధించి మొత్తం జరిమానా రూ.1,332.42 కోట్లుగా ఉంది.

ఇందులో రూ.406.65 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అంటే దాదాపు 25 శాతం చెల్లింపులు పూర్తయ్యాయి.

మిగిలిన 75 శాతం, అంటే రూ.925.77 కోట్ల చలాన్ మొత్తం ఇంకా బకాయిగానే ఉంది.

ఈ బకాయిలను విద్యుత్ బిల్లులతో కలిపి వసూలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. రాష్ట్రంలో బకాయిలను ఎలా రాబట్టాలనే అంశంపై ప్రభుత్వంతో చర్చించాలని రవాణాశాఖ భావిస్తున్నట్లు సమాచారం.

వివరాలు 

ఏటికేడు పెరుగుతున్న  ఉల్లంఘనలు..

మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం,ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఆగకుండా వెళ్లడం,హెల్మెట్ లేదా సీటు బెల్టు ధరించకపోవడం,రాంగ్‌సైడ్‌లో ప్రయాణించడం,డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వినియోగించడం వంటి ప్రమాదకర ఉల్లంఘనలు రాష్ట్రంలో ఏటా పెరుగుతున్నాయి.

2024లో ఈ తరహా ఉల్లంఘనలకు సంబంధించి 1,17,50,284చలాన్లు నమోదయ్యాయి.

2025లో ఈ సంఖ్య 1,58,52,113కుపెరిగింది.ఇక 2026లో జనవరి 1 నుంచి ఆగస్టు 15 వరకు కేవలం ఎనిమిదిన్నర నెలల్లోనే 1,01,63,600చలాన్లు నమోదయ్యాయి.

ట్రాఫిక్ ఉల్లంఘనలు ఇలా పెరుగుతుండటంతో కేవలం జరిమానాలు విధించడంతో సరిపెట్టకుండా డ్రైవింగ్ లైసెన్సులపైనా చర్యలు తీసుకుంటున్నట్లు రవాణాశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

2024ఏప్రిల్ 1 నుంచి 2025మార్చి 31 వరకు రాష్ట్రంలో మొత్తం 14,725డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్ అయ్యాయి.

వీటిలో 12,398లైసెన్సుల సస్పెన్షన్‌కు పోలీసులు సిఫార్సు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

2024 నుంచి 2026 వరకు చలాన్ల వివరాలు:

విధించిన మొత్తం జరిమానాలు: రూ.1,332.42 కోట్లు వసూలైన మొత్తం: రూ.406.65 కోట్లు వాహనదారుల నుంచి రావాల్సిన బకాయిలు: రూ.925.77 కోట్లు మొత్తం నమోదైన చలాన్లు: 3,77,65,997 వాహనదారులు చెల్లించిన చలాన్లు: 94,09,165 పెండింగ్‌లో ఉన్న చలాన్లు: 2,83,56,832

ADVERTISEMENT