Rat Biting: ఎలుక కొరికి 40 రోజుల పసికందు మృతి
నాగర్‌కర్నూల్ జిల్లా నాగనూల్ గ్రామంలో ఎలుక కొరికి 40రోజుల పసికందు చెందాడు. హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు చనిపోయాడు. నాగర్‌కర్నూల్ కు చెందిన లక్ష్మీకళ,శివకు 40రోజుల క్రితం బాలుడు జన్మించాడు. అయితే శనివారం రాత్రి లక్ష్మీకళ చిన్నారితో కలిసి నెలపై పడుకుంది. నిద్రపోయాక.. చిన్నారిని ఎలుక కొరకడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే కుటుంబ సభ్యులు బాలుడిని నాగర్‌కర్నూల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. నీలోఫర్‌లో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఎలుక కాటు చిన్న పిల్లలలో తీవ్ర జ్వరానికి కారణమవుతుంది. చిన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటడంతో ఎలుక కాటు ప్రాణాపాయంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.