LOADING...
Telangana School Calendar: ఈ ఏడాది స్కూల్స్ క్యాలెండర్ విడుదల
ఈ ఏడాది స్కూల్స్ క్యాలెండర్ విడుదల

Telangana School Calendar: ఈ ఏడాది స్కూల్స్ క్యాలెండర్ విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2025
12:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలోని స్కూళ్లకు సంబంధించిన కొత్త విద్యా సంవత్సరం వచ్చే గురువారం, జూన్ 12న ప్రారంభం కానుంది. ఈ మేరకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 12న పాఠాలు ప్రారంభమవుతుండగా, వచ్చే ఏడాది ఏప్రిల్ 23ను చివరి పనిచేసే రోజుగా ప్రకటించారు. ఆ తర్వాత ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు కొనసాగనున్నాయని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారు. 2025-26 విద్యాసంవత్సరానికి మొత్తం 230 పనిచేసే రోజులు ఉండనున్నాయి. అంతేకాకుండా, ఇప్పటికే ప్రారంభమైన బడిబాట కార్యక్రమం ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగనుంది.

వివరాలు 

పరీక్షల తేదీలు ఇలా... 

సమ్మేటివ్-1 (SA1) పరీక్షలు అక్టోబర్ 24 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు. సమ్మేటివ్-2 (SA2) పరీక్షలు ఏప్రిల్ 10 నుంచి 18 వరకు జరుగనున్నాయి. 10వ తరగతి ప్రీఫైనల్స్ ఫిబ్రవరి 28లోగా పూర్తయ్యేలా షెడ్యూల్ రూపొందించారు. మార్చి నెలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయని పేర్కొన్నారు.

వివరాలు 

ప్రత్యేక కార్యక్రమాలు... 

ప్రతి నెల మొదటి వారం పాఠశాల నిర్వహణ కమిటీ (SMC) అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ (AAPC) సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రతి నెల మూడవ శనివారాన్ని నో బ్యాగ్ డేగా జరపనున్నారు. సెలవుల వివరాలు ఇలా.. దసరా సెలవులు: సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు. క్రిస్మస్ సెలవులు (మిషనరీ పాఠశాలలకు మాత్రమే): డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 27 వరకు. సంక్రాంతి సెలవులు: జనవరి 11 నుంచి జనవరి 15 వరకు.