LOADING...
TGSRTC: తెలంగాణ ఆర్టీసీ సమ్మె తాత్కాలిక విరమణ
తెలంగాణ ఆర్టీసీ సమ్మె తాత్కాలిక విరమణ

TGSRTC: తెలంగాణ ఆర్టీసీ సమ్మె తాత్కాలిక విరమణ

వ్రాసిన వారు Jayachandra Akuri
May 06, 2025
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠకు కారణమైన తెలంగాణ ఆర్టీసీ సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో జరిగిన చర్చలు సఫలమవడంతో ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మెను నిలిపివేసినట్లు ప్రకటించారు. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నవీన్ మిత్తల్, లోకేశ్ కుమార్, కృష్ణభాస్కర్‌లు సభ్యులుగా ఉండగా.. వారితో ఉద్యోగ సంఘాలు చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి మార్గాలు సూచించాల్సిందిగా ఆదేశించింది.

Details

వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని డిమాండ్

ఒక వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే తమ డిమాండ్ల సాధన కోసం టీజీఎస్ ఆర్టీసీ ఐకాస నేతలు మే 7 నుంచి సమ్మెకు దిగుతామంటూ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మే 6 అర్ధరాత్రి వరకు ప్రభుత్వం చర్చలకు రావాలని కోరారు. అయితే నిరసనల దశలో భాగంగా సోమవారం ఉద్యోగులు భారీ కవాతు నిర్వహించారు. అయితే చివరకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ చొరవ తీసుకుని జేఏసీ నేతలతో చర్చలు జరపడం, ప్రభుత్వ స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగులలో నమ్మకాన్ని పెంచిన ప్రభుత్వం, తాత్కాలికంగా సమ్మెను అడ్డుకుంది.