Telangana: సమగ్ర శిక్ష తెలంగాణ కోఆర్డినేటర్ పోస్టులకు అక్టోబర్ 5, 6న పరీక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ సమగ్ర శిక్షా విభాగంలో ఖాళీగా ఉన్న కోఆర్డినేటర్ పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రాష్ట్ర, జిల్లా ప్రాజెక్టు కార్యాలయాలతో పాటు జిల్లా విద్యాశాఖాధికారుల పరిధిలోని కోఆర్డినేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్ రాత పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. అక్టోబర్ 5, 6 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్షా తెలంగాణ వెల్లడించింది. అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.
వివరాలు
పరీక్షల షెడ్యూల్ ఇలా..
కోఆర్డినేటర్ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ పరీక్షలు రెండు రోజుల పాటు వేర్వేరు షిఫ్టుల్లో జరుగుతాయి.
రాష్ట్ర ప్రాజెక్టు కార్యాలయంలోని కోఆర్డినేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అక్టోబర్ 5న ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.
అదే రోజు జిల్లా ప్రాజెక్టు కార్యాలయాల్లోని కోఆర్డినేటర్ పోస్టులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది.
జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ పోస్టులకు అక్టోబర్ 6న పరీక్ష నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఆన్‌లైన్ పరీక్ష జరుగుతుంది.
వివరాలు
హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను పాఠశాల విద్య లేదా సమగ్ర శిక్షా తెలంగాణ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం https://www.samagrashiksha.telangana.gov.in/SamagraShiksha/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
అనంతరం రిజిస్ట్రేషన్ నంబర్ లేదా అప్లికేషన్ ఐడీ, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
వివరాలు సమర్పించిన తర్వాత హాల్‌టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకోవాలి.
వివరాలు
పరీక్ష కేంద్రానికి 45 నిమిషాల ముందే..
అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి కనీసం 45 నిమిషాల ముందే చేరుకోవాలి.
పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు హాల్‌టికెట్‌తో పాటు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాన్ కార్డు వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక అసలు పత్రాన్ని తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు
పరీక్ష కేంద్రంలో మొబైల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు.
అభ్యర్థులు పరీక్షకు వెళ్లే ముందు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.